Published On: Tue, Jun 18th, 2019

క‌ర‌క‌ట్ట ప‌క్క‌న నివాసం నుంచి చంద్ర‌బాబును ఖాళీ చేయిస్తాం

* వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి

సెల్ఐటి న్యూస్‌, అమరావతి: కృష్ణానది కరకట్ట పక్కన ఉన్న నివాసం నుంచి తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడును ఖాళీ చేయిస్తామని వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం ఉదయం శాసనసభ లాబీలో ఆయ‌న మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. కరకట్టపై అక్రమ నిర్మాణాలకు సంబంధించి కోర్టుకు వెళ్తామని స్పష్టం చేశారు. అమరావతిలో ఇల్లు కూడా కట్టుకోని చంద్రబాబు రాజధానిపై మాట్లాడుతున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్‌ తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్న విషయాన్ని ఈ సంద‌ర్భంగా ఆయ‌న గుర్తు చేశారు. రాజధాని పనులు ఆగిన విషయం తనకు తెలియదని చెప్పారు. పనులు ఎందుకు ఆపేశారో గుత్తేదారులే సమాధానం చెప్పాలన్నారు. గుత్తేదారులకు అనుమానాలు ఉంటే ప్రభుత్వాన్ని సంప్రదించాలని సూచించారు. సీఆర్డీఏ ఛైర్మన్‌గా సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ఉంటారని, ఆపదవి తనకు ఇస్తారన్న విషయం తెలియదని ఆర్కే అభిప్రాయపడ్డారు.

Just In...