Published On: Tue, Nov 13th, 2018

క‌ర‌వు రైతుల‌ను ఆదుకోవ‌డంలో కేంద్రం విఫ‌లం

* మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి

సెల్ఐటి న్యూస్‌, గుంటూరు: వ్యవసాయ కరువు కటకాల్లో నష్టపోయిన రైతులను,ప్రజలను ఆదుకోవడంలో కేంద్రప్రభుత్వం  పూర్తిగా విమలమైందని వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. మంగ‌ళ‌వారం ఉద‌యం గుంటూరు అగ్రికల్చర్  కార్యాలయంలో నిర్వహించిన 13 జిల్లాల డైరెక్టర్, ఎగ్జిక్యూటివ్ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రస్తుతం వ్యవసాయ అనుబంధ రంగాల్లో 17.6 శాతం అభివృద్ధి గ్రోత్ సాధించి , మైక్రో ఇరిగేషన్లో దేశంలో రాష్ట్రానికి తొలిస్థానం లో ఉందని అన్నారు. డైరెక్ట్ బెనిఫిట్ సిస్టంలో ముందు వరుసలో, భూసార పరీక్షల్లో రాష్ట్రానిదే ప్రధమస్థానం  సాధించామని తెలిపారు, రాష్ట్రంలో 34.5 శాతం వర్షపాతం లోటుండడంతో కొంత రైతాంగానికి నీరు అందించలేకపోతున్నామని తెలిపారు.. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో లోటు వర్షపాతం ఉన్న ప్రాంతాలను, తిత్లీ తుపాను బాధితులను ప్రభుత్వం ఆదుకున్న‌ విషయాన్ని గుర్తుచేశారు. రూ.3,800 కోట్ల మేరకు మార్కెట్ స్థిరీకరణ నిధులు వెచ్చించి, రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు ఉంటే కేంద్రం స్పందించడం చాలా దుర్మార్గం అన్నారు. కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు కక్ష్య పెంచుకున్న కేంద్రప్రభుత్వం కావాలని రైతులను,ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుందని ఆయన ఆరోపించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం  రాజకీయాలకు అతీతంగా రైతులను కేంద్రం ఆదుకోవాలి  తప్ప అన్యాయం చేయకూడదని ఆయన సూచించారు. తిత్లీ తుపాను బాధితులను కేంద్రం  సరిగ్గా ఆదుకోలేదని, 3,600 కోట్ల రూపాయల నష్టం జరిగితే 220 కోట్లిచ్చి  చేతులు దులుపుకుందని రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి ఆరోపించారు. గుంటూరు నగరంలో 13 జిల్లాల వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్లతో సమీక్ష నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 34.5 శాతం వర్షపాతం లోటుందని, లోటు బడ్జెట్ లో  ఉన్నప్పటికీ తిత్లీ తుపాను బాధితులను ఆదుకున్నామని తెలిపారు. స్వామినాథన్ కమిషన్ సిపార్సులను కేంద్రం ప్రకటనలకే పరిమితం చేసిందని విమర్శించిన సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి.. ఇప్పటికే 315  మండలాలను కరవు మండలాలుగా ప్రకటించామని, తాజాగా కర్నూలు జిల్లాలో 16 మండలాలు, విజయనగరం జిల్లాలో 17 మండలాలు వీటికి కలిపామని వివరించారు.

Just In...