Published On: Tue, May 15th, 2018

గంజాయి కేసులో నిందితుడికి జైలు, జ‌రిమానా

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ క్రైం: విజ‌యవాడ నగర పోలీస్ కమీషనరేట్‌లోని కృష్ణలంక పోలీస్‌స్టేషన్ పరిధిలో 2013లో క్రైం.నెం.207/2013 సెక్షన్ 20(బి), ఆఫ్ ఎన్.డి.పి.ఎస్ యాక్ట్ కేసులో నిందితుడైన విశాఖపట్నంకు చెందిన కంకిపాటి చిన్నాకు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి నిందితునకు 5 సంవత్సరాల జైలు శిక్ష, రూ.10 వేలు జరిమానా విధించడం జరిగింది. పోలీసులు తెలిపిన‌ కృష్ణలంక పోలీస్‌స్టేషన్ పరిధిలో 2013 మార్చి 29న మధ్యాహ్నం 12 గంట‌ల‌కు  నిందితుడైన కంకిపాటి చిన్నా విజయవాడ పి.ఎన్.బి.ఎస్ వద్ద గల సాయి క్లోక్‌రూమ్ దగ్గర గంజాయితో ఉన్నట్లుగా వచ్చిన సమాచారం మేరకు కృష్ణలంక అడిషినల్ ఇన్‌స్పెక్టర్ ఐ.డి.సువర్ణరాజు వారి సిబ్బందితో వెళ్ళి విచారించగా సదరు నిందితుని వద్ద 11.936 కేజీల గంజాయితో అతనిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో కృష్ణలంక పోలీస్‌స్టేషన్ అడిషినల్ ఇన్‌స్పెక్టర్ ఐ.డి.సువర్ణరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. దర్యాప్తులో భాగంగా నిందితుడైన విశాఖపట్నంకు చెందిన కంకిపాటి చిన్నా (25)పై కేసు నిరూపించడంతో ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరుపున డిప్యూటీ డైరెక్టర్ సుశీలా గోపాల్, సి.యమ్.ఎస్. ఇన్‌స్పెక్టర్ జి.శ్రీనివాస్ పర్య‌వేక్షణలో, సి.ఎమ్.ఎస్ ఎ.ఎస్.ఐ ఎ.యమ్.ఎస్. రెడ్డి, ఏడుగురు సాక్షులను విచారించ‌డంతో ముద్దాయిపై నేరం ఋజువైన నేప‌ధ్యంలో మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి ఎ.వి.రమేష్‌బాబు నిందితునకు 5 ఏళ్లు జైలు శిక్షతో పాటు రూ.10 వేలు జరిమానా విధించారు.

Just In...