Published On: Fri, Feb 7th, 2020

గంజాయి త‌ర‌లిస్తున్న వ్య‌క్తి అరెస్టు…

మ‌ల్కాజిగిరి, సెల్ఐటి న్యూస్‌: గ‌ంజాయి తరలిస్తున్న వ్యక్తిని మల్కాజిగిరి ఎక్సైజ్ పోలీసులు శుక్ర‌వారం అరెస్టు చేశారు. వైజాగ్, సీలేరు నుండి స్విప్ట్ కారులో తరలిస్తున్న 120 కిలోల గంజాయిని సీజ్ చేశారు. కొత్తగూడెం జిల్లాకు చెందిన వెంకుడోత్ సురేష్ అనే వ్యక్తి ఆరు నెలలుగా గంజాయి సరఫరా చేస్తున్నాడు. డిల్లీ, వెస్ట్ బెంగాల్, తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్రలలో గంజాయి సరఫరా చేస్తున్న‌ట్లు పోలీసులు తెలిపారు. వైజాగ్‌లోని సీలేరులో కిలో రూ.5 వేలకు కొనుగోలు చేసి రూ.10 వేల‌కు విక్ర‌యిస్తున్నాడ‌ని పోలీసులు తెలిపారు. విశ్వసనీయ సమాచారంతో మౌలాలి జెడ్.టి.ఎస్ వద్ద నిందితుడు సురేష్ అరెస్ట్ చేశారు.

 

Just In...