Published On: Wed, Dec 4th, 2019

గత ప్రభుత్వంలో పోలవరం మట్టినీ దోపిడీ చేశారు…

* అధికారుల‌తో స‌మీక్ష‌లో మంత్రులు పెద్దిరెడ్డి, అనీల్‌కుమార్ యాద‌వ్‌అమ‌రావ‌తి, సెల్ఐటి న్యూస్‌: గ‌త ప్ర‌భుత్వంలో పోల‌వ‌రం ప్రాజెక్టు మ‌ట్టిని కూడా దోపిడీ చేశార‌ని

అమ‌రావ‌తి, సెల్ఐటి న్యూస్‌: గ‌త ప్ర‌భుత్వంలో పోల‌వ‌రం ప్రాజెక్టు మ‌ట్టిని కూడా దోపిడీ చేశార‌ని రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, అనీల్‌కుమార్ యాద‌వ్ ఆరోపించారు. మంగ‌ళ‌వారం స‌చివాల‌యంలో రిగేషన్‌, గనులశాఖ అధికారులతో మంత్రులు సమీక్షా సమావేశం నిర్వ‌హించారు. ఇరిగేషన్‌ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదిత్యానాధ్ దాస్, గనుల శాఖ ముఖ్య కార్యదర్శి రామగోపాల్, ఇరిగేషన్ ఇఎన్‌సి వెంకటేశ్వరరావు, సిఇ పోలవరం సుధాకర్‌ బాబు, ఆర్ఎంసి ఎస్ఇ వీరకుమార్, ఎల్ఎంసి ఎస్ఇ శ్రీనివాసయాదవ్, పలువురు ఇరిగేషన్‌, గనులశాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రులు ప‌లు అంశాల‌పై చ‌ర్చించి నిర్ణ‌యాలు తీసుకున్నారు.

– పోలవరం మట్టి అక్రమ రవాణాను అరికట్టేందుకు చర్యలు.
– ఇసుక పాలసీ మాదిరిగా మట్టి పాలసీని అమలు చేయాలి.
– గత ప్రభుత్వంలో పోలవరం మట్టిని దోపిడీ చేశారు.
– ప్రభుత్వానికి కనీసం సీనరేజీ కూడా చెల్లించకుండా మట్టిని విక్రయించారు.
– కోట్లాధి రూపాయల విలువైన పోలవరం మట్టిని అనధికారికంగా తరలించారు.
– మట్టిమాఫియాకు చెక్ పెట్టేందుకు చర్యలు చేపట్టాలి.
– పోలవరం కాలువ గట్లపై సుమారు 12 కోట్ల క్యూబిక్ మీటర్ల ఎర్త్ సాయిల్ వుంది.
– దీనిని ఎస్ఎస్ఆర్ రేట్ ల ప్రకారం విక్రయిస్తే ప్రభుత్వానికి సుమారు రూ.1000 కోట్ల ఆదాయం.
– దీనిలో ఇరిగేషన్‌ శాఖకు రూ.700 కోట్లు
– మైనింగ్ శాఖకు సీనరేజీ కింద రూ. 300 కోట్ల వరకు ఆదాయం.
– ఉభయగోదావరి, కృష్ణా, విశాఖ జిల్లాల పరిధిలో మట్టి నిల్వలు.
– పోలవరం మట్టిని నిల్వ చేసేందుకు సుమారు 5వేల ఎకరాల భూమి వినియోగం.
– ఈ మట్టి విక్రయాల తరువాల ప్రభుత్వ అవసరాలకు సదరు ఖాళీ భూమి.
– నాలుగు జిల్లాల పరిధిలో కాలువలపై మట్టిని 80 ప్యాకేజీలుగా గుర్తింపు.
– ఇరిగేషన్‌, మైనింగ్ అధికారులు సంయుక్తంగా ఈ ప్యాకేజీలను పరిశీలించాలి.
– రెండు వారాల్లో దీనిపై ఓ పాలసీని రూపొందించాలి.
– కాలువ గట్లపై వున్న గ్రావెల్, మెటల్, మట్టిని వర్గీకరించాలి.
– ఎర్త్ సాయిల్ క్యూబిక్ మీటర్ రూ. 86,  గ్రావెల్ కు  రూ.113 గా రేటు ఖరారు.
– అదనంగా మైనింగ్ సీనరేజ్ కింద క్యూబిక్ మీటరకు 30 రూపాయలు
– మట్టినిల్వలను టెండర్, ఆక్షన్‌ పద్దతుల్లో విక్రయించాలి.
– మూడేళ్లలో ఈ మట్టినిల్వలను విక్రయించుకోవచ్చు.
– ఇప్పటికే 71 లక్షల క్యూబిక్ మీటర్ల కోసం 41 దరఖాస్తులు వచ్చాయి.
– గ్రావెల్, మెటల్ వున్న ప్రాంతాల్లో ఎక్కువ డిమాండ్ వస్తోంది.
– మెటల్ ఎక్కువగా వున్న చోట్ల అవసరమైతే క్రషర్ లకు కూడా అనుమతి ఇచ్చే అంశం పరిశీలన.

Just In...