Published On: Mon, Jan 7th, 2019

గిన్నిస్‌ బుక్‌లో పోలవరం

సెల్ఐటి న్యూస్‌, పోలవరం: ఆంధ్రప్రదేశ్ ప్ర‌జ‌ల జీవనాడిగా ఉన్న పోలవరం ప్రాజెక్టు పనుల్లో సోమవారం రెండు ప్రపంచ రికార్డులు ఆవిష్కృతమయ్యాయి. గతంలో చేపట్టిన 21,580 క్యూబిక్‌ మీటర్ల పనులను 16 గంటల్లోనే నవయుగ సంస్థ అధిగమించింది. 24 గంటల్లో 32,315 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులతో గిన్నిస్‌ రికార్డుకెక్కింది. ప్రపంచ రికార్డు స్థాయిలో కాంక్రీట్‌ను నవయుగ సిబ్బంది డంప్‌ చేశారు. శ‌నివారం ఉదయం 8 గంటల నుంచి సోమ‌వారం ఉదయం 8గంటల వరకు నిరంతరాయంగా కాంక్రీట్‌ పోసి రికార్డు సృష్టించారు. దీంతో పోలవరం పనుల్లో రికార్డు నమోదైనట్టు గిన్నిస్‌ రికార్డు ప్రతినిధులు ప్రకటించారు. అనంతరం పోలవరం ప్రాజెక్టు వద్దే ప్రతినిధులు గిన్నిస్‌ రికార్డు ధ్రువపత్రాన్ని సీఎం చంద్రబాబు నాయుడుకు అందజేశారు.

Just In...