Published On: Fri, May 10th, 2019

గుంటూరు జిల్లాలో భారీగా ఎస్సైల బదిలీలు

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి క్రైం: గుంటూరు జిల్లాలో 84 మంది ఎస్సైలను బదిలీ చేస్తూ జిల్లా గ్రామీణ ఎస్పీ రాజశేఖర్‌ బాబు ఆదేశాలు జారీ చేశారు. ఒకే పోలీస్‌ స్టేషన్‌లో సంవత్సరాల తరబడి పని చేస్తున్న ఎస్సైలతో పాటు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి జాబితాను సిద్ధం చేయించి ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. పరిపాలనలో పారదర్శకత తేవాలనే ఉద్దేశంతోనే ఒకేసారి 84 మంది ఎస్సైలను బదిలీ చేస్తున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఈ మేరకు గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఓట్ల లెక్కింపునకు కొద్దిరోజులు ముందు పెద్ద ఎత్తున బదిలీ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Just In...