Published On: Sat, May 12th, 2018

గుంటూరు జిల్లా దాచేపల్లిలో మరో ఘోరం

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి క్రైం: గుంటూరు జిల్లా దాచేపల్లిలో మరో ఘోర అకృత్యం వెలుగు చూసింది. బాలికపై ఓ ఎంపీటీసీ భర్త అత్యాచారానికి తెగబడ్డాడని సమాచారం… గత కొంతకాలంగా బాలికను బెదిరించి మాబువలీ అనే వ్యక్తి ఘాతుకానికి పూనుకున్నాడని తెలుస్తుంది.. విషయం ఎవరితోనైనా చెబితే చంపేస్తానంటూ బెదిరింపులకు దిగటంతో.. చేసేదేమీ లేక బాధితురాలు భయంతో ఉండిపోయింది. మొత్తం మీద ఆ బాలిక స్థానికుల సహకారంతో పోలీసులను ఆశ్రయించడంతో దుర్మార్గుడి దురాగతం బయటపడినట్లు సమాచారం.. బాలికను పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె 3 నెలల గర్భవతిగా వైద్యులు నిర్థారించారని సమాచారం.

Just In...