Published On: Mon, Nov 20th, 2017

గుండెపోటుతో కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత

సెల్ఐటి న్యూస్‌, దిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, బెంగాల్‌కు చెందిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ప్రియరంజన్‌ దాస్‌ మున్షి (72) కన్నుమూశారు. దిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. తీవ్రమైన గుండెపోటు కారణంగా పక్షవాతానికి గురైన ఆయన 2008 నుంచి కోమాలోనే ఉన్నారు. ఈ క్రమంలో ఆయన చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో సోమవారం మరణించారు. 1999 నుంచి 2009వరకు ఎంపీగా, మన్మోహన్‌సింగ్‌ హయాంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా, 2004 నుంచి 2009 వరకు సమాచార ప్రసార శాఖ మంత్రిగా మున్షి సేవలందించారు. పశ్చిమ్‌బంగలోని రాయ్‌గంజ్‌ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. గ‌తంలో ఆయన ఆసుపత్రిలో ఉన్నప్పుడు 2009లో ఆయన భార్య దీపా ఎన్నికల బరిలో నిలిచారు. దాదాపు 20 సంవత్సరాల పాటు అఖిల భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య అధ్యక్షుడిగానూ మున్షి సేవలందించారు. ఆయన మృతి పట్ల పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పలువురు కాంగ్రెస్‌ నేతలు సంతాపం తెలిపారు.

Just In...