Published On: Mon, Sep 21st, 2020

గురజాడ అడుగుజాడల్లో యువత పయనించాలి

* పాఠశాల విద్య సంచాలకులు వాడ్రేవు చినవీరభద్రుడు

విజ‌య‌వాడ, సెల్ఐటి న్యూస్‌‌: నవయుగ వైతాళికులు, మహాకవి గురజాడ అడుగు జాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని పాఠశాల విద్య సంచాలకులు వాడ్రేవు చినవీరభద్రుడు అన్నారు. ఇబ్రహీంపట్నంలోని రాష్ట్ర విద్య పరిశోధన శిక్షణా సంస్థ (ఎస్సీఈఆర్టీ)లో సోమవారం గురజాడ 158వ జయంతి వేడుక‌ల‌ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాడ్రేవు చినవీరభద్రుడు మాట్లాడుతూ గురజాడ రాసిన కన్యాశుల్కం, కన్యక, పూర్ణమ్మ వంటి రచనలు అభ్యుదయానికి మార్గదర్శమని, సమాజంలో మార్పు తీసుకురావడానికి అవి ఎంతగానో దోహదపడ్డాయని పేర్కొన్నారు. ‘‘గురజాడ గురించి ఒక వ్యాసం రాయడానికి  దలుపెడుతూ ‘మళ్ళా ఇవాళ కొత్తగా గురజాడ గురించి ఏమి చెప్పగలనా అని అనుకున్నానుగానీ, ఆయన్ను తలుచుకుంటేనే చాలు, ఎన్నో కొత్త ఆలోచనలు ఉప్పొంగుతున్నాయి’‌ అని శ్రీశ్రీ అన్న మాటలు, ఆసక్తికర విషయాలను గుర్తు చేశారు. కార్యక్రమంలో ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ డాక్ట‌ర్ బి.ప్రతాప్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

 

Just In...