గురుద్వార్‌లో సీఎం జగన్ ప్రత్యేక ప్రార్థనలు
విజయవాడ, సెల్ఐటి న్యూస్: గురునానక్ జయంతి సందర్భంగా గురుపూరబ్ ఉత్సవాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాల్గొన్నారు. విజయవాడలోని గురునానక్ కాలనీలోని గురుద్వార్‌లో జరిగిన గురుపూరబ్ ఉత్సవాల్లో భాగంగా సీఎం వైయస్ జగన్ ఆదివారం గురుద్వార్‌ను సందర్శించి ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పేర్ని వెంకట్రామయ్య( నాని), కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు( నాని), వెలంపల్లి శ్రీనివాసరావు, మహిళా కమిషన్ ఛైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ, ప్రభుత్వ కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్, బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ మల్లాది విష్ణు, ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, ఎమ్మెల్యేలు జోగి రమేష్, కైలే అనిల్‌కుమార్, వైయస్సార్సీపీ తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్, స్త్రీ సత్ సంగమ్ (మహిళా విభాగం) అధ్యక్షురాలు కులదీప్‌కౌర్ మాతాజీ, సిఖ్ కమ్యూనిటీ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు ఎస్.హర్మహిందర్ సింగ్, శ్రీ గురుసింగ్ సభ అధ్యక్షులు ఎస్.కన్వల్జిత్సింగ్, పింకి హర్విందర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.