Published On: Wed, Jun 24th, 2020

గుర్తింపు లేని పాఠశాలలు మూసివేత

* పాఠశాల విద్య కమిషనర్ వాడ్రేవు చినవీరభద్రుడు

విజ‌య‌వాడ, సెల్ఐటి న్యూస్‌‌: కృష్ణా జిల్లాలో ప్రభుత్వ గుర్తింపు లేని 9 పాఠశాలలను మూసివేయడమైనదని పాఠశాల విద్య కమిషనర్ వాడ్రేవు చినవీరభద్రుడు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారనిమిత్తం పాఠశాల వివరాలను తెలియజేస్తున్నామన్నారు. కొన్ని పాఠశాలలు పదో తరగతి విద్యార్థులకు బోధించడానికి అనుమతి లేనప్పటికీ తరగతులు నిర్వహించి ఇతర బ్రాంచుల ద్వారా పదో తరగతి పరీక్షలకు నామినల్ రోల్స్ పంపించడం జరిగిందని గుర్తించారు. అలా ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించినందుకు 5 పాఠశాలలపై రూ.లక్ష చొప్పున జరిమానా వేసి, ఆయా పాఠశాలల యాజమాన్యాలపై క్రిమినల్ చర్యలు తీసుకుంటూ, వాటి గుర్తింపు పూర్తిగా రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ఆటస్థలం, అర్హత లేని ఉపాధ్యాయులతో నిర్వహిస్తున్న మరో 4 పాఠశాలల గుర్తింపును కూడా రద్దు చేస్తున్నామని పేర్కొన్నారు.

గుర్తింపు రద్దు చేసిన పాఠశాలల వివరాలు…

* పదో తరగతి పరీక్షలకు అనుమతి లేని పాఠశాలల జాబితా:

1.విజయవాడ రవీంద్రభారతి స్కూల్, బాలాజీ నగర్, కృష్ణలంక, విజయవాడ అర్బన్.

2. నారాయణ స్కూల్, సత్యనారాయణపురం,విజయవాడ అర్బన్.

3. నారాయణ స్కూల్, కరెన్సీనగర్, విజయవాడ అర్బన్.

4. చైతన్య పబ్లిక్ స్కూల్,కరెన్సీనగర్, విజయవాడ అర్బన్.

5. చైతన్య పబ్లిక్ స్కూల్, కానూరు, పెనమలూరు మండలం.

కనీస సౌకర్యాలు లేని పాఠశాలల జాబితా…

1. ఆక్స్ ఫర్డ్ స్కూల్, భవానీపురం,  విజయవాడ అర్బన్.

2. ఆక్స్ ఫర్డ్ స్కూల్, పటమట, విజయవాడ అర్బన్.

3. ఆక్స్ ఫర్డ్ స్కూల్, రామవరప్పాడు,  విజయవాడ రూరల్.

4. విజయవాడ రవీంద్రభారతి స్కూల్, కానూరు, పెనమలూరు మండలం.

అలానే కంకిపాడు మండలంలో కొంతంపాడులోని చైతన్య హైస్కూలు నిర్వహించేందుకు విద్యాశాఖ అనుమతి తీసుకుని, అనంతరం విద్యాశాఖ అనుమతి ఉల్లంఘిస్తూ ఆ పాఠశాలను వేరే చోటుకు పునాదిపాడు (గోశాల)కు మార్చడం వల్ల ఆ పాఠశాలపై తగిన చర్యలు తీసుకుంటుమన్నారు.

Just In...