Published On: Fri, Apr 12th, 2019

గెలుపోట‌ముల‌తో ప‌నిలేకుండా ప్ర‌జాసేవ చేస్తా

* బీజేపీ ప‌శ్చిమ అభ్య‌ర్థి పీయూష్ దేశాయ్

* నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు కృత‌జ్ఞ‌త‌లు 

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ ప‌శ్చిమ‌: ఈ ఎన్నిక‌ల్లో త‌న‌దే గెలుపు అని బీజేపీ ప‌శ్చిమ అభ్య‌ర్థి పీయూష్ దేశాయ్ ధీమా వ్య‌క్తం చేశారు. ఈ మేర‌కు శుక్ర‌వారం ఆయ‌న ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ద‌శాబ్ధాల కాలంగా అభివృద్ధికి నోచుకోని ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గాన్ని అన్ని ర‌కాలుగా ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా తీర్చిదిద్దాల‌నే ఆలోచ‌న‌తోనే తాను ఎమ్మెల్యేగా పోటీ చేయ‌డం జ‌రిగింద‌న్నారు. బీజేపీ నాయ‌కుడిగా రాష్ట్ర స్థాయితో పాటు జాతీయ‌స్థాయిలోనూ ప‌ద‌వులు అధిరోహించిన‌ప్ప‌టికీ తాను అనేకం ప్ర‌జా సేవ కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించ‌డం జ‌రిగింద‌ని గుర్తుచేశారు. అయితే ప్ర‌జాప్ర‌తినిధిగా ఉంటే ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాటం చేసైనా ప్ర‌భుత్వం నుండి నిధులు మంజూరు చేయించుకోవ‌డం ద్వారా ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గాన్ని అభివృద్ధి చేయ‌వ‌చ్చ‌నే ఆలోచ‌న‌తోనే తాను ప‌శ్చిమ ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా పోటీ చేయ‌డం జ‌రిగింద‌న్నారు. త‌న ఆలోచ‌న‌ను గ్ర‌హించి పార్టీ అధిష్టానం కూడా త‌న‌కు సీటు కేటాయించింద‌ని తెలిపారు. ఈ క్ర‌మంలో త‌న గెలుపును కాంక్షిస్తూ పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, అభిమానులు నిరంత‌రం వెన్నంటి ఉంటూ ప‌క్ర‌చారంలో మ‌ద్ద‌తుగా నిల‌వ‌డం ప‌ట్ల ఆయ‌న వారికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. రాబోయే ఎన్నిక‌ల ఫ‌లితాల‌లో గెలుపోట‌ముల‌తో సంబంధం లేకుండా తాను సామాజిక బాధ్య‌త‌గా ప్ర‌జాసేవలోనే ఉంటాన‌ని, ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై రాజీలేని పోరాటం సాగిస్తాన‌ని పీయూష్ దేశాయ్ స్ప‌ష్టం చేశారు.

Just In...