Published On: Fri, May 11th, 2018

గోదారమ్మ ఒడిలో వ‌రుస ప్ర‌మాదాలు

* ప‌ట్ట‌ని అధికార‌గ‌ణం.. 

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: గోదావరి నదిలో తరచూ ప్రమాదాలు జరుగుతున్న సంబంధిత ఉన్నత అధికారులు పట్టించుకోకపోవడంతో బోటుల యాజమాన్యలు వ్యాపారమే ద్యేయంగా ప్రయాణీకులను దోచుకుంటున్నారు. కాని వారి ప్రాణాలకు ఎటువంటి రక్షణ కల్పించండంలేదు. ముఖ్యంగా దేవిపట్నంలో బోటులను రోజువారి తనిఖీ చేయవలసి ఉండగా  ఇటు రెవిన్యూ అధికారులుగానీ అటు పోలీసు యంత్రాంగం గానీ పట్టించుకోకపోవడంతో గోదావరిలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. అలాగే బోటు సుపెరిండెంట్, ఉన్నతాధికారులు కానీ బోటును తనిఖీ చేయకుండానే విహార‌యాత్రకు అనుమతించడంతో నెలకు సుమారు 2 లేక 3 ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటిలో ప్రాణనష్టం ,ఆస్తి నష్టం కుడా జరుగుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి కండిషన్లో ఉన్న బోటులను అనుమతించి రోజువారి తనిఖీలుతో పాటు బోటు కెపాసిటీని బ‌ట్టి ఎంతమందిని బోటులో ప్రయాణించ వచ్చో అంత మందిని మాత్రమే అనుమతిస్తే కొంత వరకు ప్రమాదాలు జరగకుండా అరికట్టవచ్చని పలువురు తెలుపుతున్నాను. అలాగే లైఫ్ జాకెట్లను,  ట్యూబ్లను బొట్లలో కనీసం కనిపించని పరిస్థితి. ప్రయాణికులు ప్రయాణించే బొట్లలోనే గ్యాస్ సిలిండర్‌తో వంటకాలు వల్ల తరచు ప్రమాదాలు జరుగుతున్న చర్యలు తీసుకుంటామని చెప్పటమే తప్ప చ‌ర్య‌లు తీసుకున్న దాఖలాలు లేవు. కనీసం ఇప్పటికైనా అధికార్లు పట్టించుకొని విహార యాత్రికులకు వెళ్లే బొట్లను తనిఖీలు నిర్వహించి యాత్రకు అనుమ‌వ్వాలని యాత్రికులు కోరుతున్నారు.
 

Just In...