Published On: Wed, May 16th, 2018

గోదావ‌రిలొ ప‌డ‌వ ప్ర‌మాదం ప‌ట్ల ర‌ఘువీరా దిగ్ర్భాంతి

* బాధిత కుటుంబాలకు అండగా ఉండాల‌ని కార్యకర్తలకు సూచన

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ‌: గోదావ‌రిలొ ప‌డ‌వ ప్ర‌మాదం ప‌ట్ల ఆంధ్ర‌ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షులు డాక్ట‌ర్ ఎన్‌.ర‌ఘువీరారెడ్డి తీవ్ర‌ దిగ్ర్భాంతి వ్య‌క్తం చేశారు. ఈ మేర‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ రాష్ట్ర కార్యాల‌యం నుంచి బుధ‌వారం ఆయ‌న ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో మంగ‌ళ‌వారం సాయంత్రం గోదావరి నదిలో జరిగిన ఘోర లాంచీ ప్రమాదంలో 45 మంది గల్లంతైన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ర‌ఘువీరారెడ్డి స్పందించారు. ప్రమాదం గురించిన వార్తను వినగానే ఎంతో ఆవేదనకు గురయ్యానని చెప్పారు. భారీ సంఖ్యలో ప్రజలు గల్లంతవడం కలచివేసిందని అన్నారు. బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల‌కు ఆయ‌న సూచించారు.

Just In...