Published On: Fri, Jul 19th, 2019

గోవిందరాజస్వామి ఆలయంలో ఆండాళ్‌ తిరువడిపురం ఉత్సవం

* ఈ నెల 25 నుండి ఆగ‌స్టు 3వ తేదీ వ‌ర‌కు నిర్వ‌హ‌ణ

సెల్ఐటి న్యూస్‌, తిరుప‌తి: తిరుపతిలోని గోవిందరాజస్వామివారి ఆలయంలో ఈ నెల 25 నుండి ఆగ‌స్టు 3వ తేదీ వ‌ర‌కు ఆండాళ్‌ అమ్మవారి తిరువడిపురం ఉత్సవం ఘనంగా జరుగనుంది. ఇందులో భాగంగా ఉత్సవ రోజుల్లో ఉదయం 6 నుండి 6.30 గంటల వరకు ఆండాళ్‌ అమ్మవారికి తిరుమంజనం, సాయంత్రం 5.30 నుండి 6.30 గంటల వరకు అమ్మవారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు. ఆగస్టు 1న‌ ఆల‌యంలో చ‌క్ర‌త్తాళ్వార్ సాత్తుమొర‌, ప్ర‌తివాది భ‌యంక‌ర అన్న‌న్ సాత్తుమొర జ‌రుగ‌నున్నాయి. ఆగస్టు 3న ఉదయం 9.30 నుండి 11.30 గంటల వరకు గోవిందరాజస్వామివారు, ఆండాళ్‌ అమ్మవారి ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం 4 నుండి 8 గంటల వరకు గోవిందరాజస్వామివారు, ఆండాళ్‌ అమ్మవారిని అలిపిరికి తీసుకెళ్లి అక్కడ ఆస్థానం నిర్వహిస్తారు. ప్రత్యేక పూజల అనంతరం అలిపిరి నుండి గీతామందిరం, రామనగర్‌ క్వార్టర్స్‌, వైఖానసాచార్యుల వారి ఆలయం, ఆర్‌ఎస్‌ మాడ వీధి, చిన్నజీయర్‌ మఠం మీదుగా ఊరేగింపు తిరిగి ఆలయానికి చేరుకుంటుంది.

Just In...