Published On: Tue, Aug 11th, 2020

గ్యాంగ్‌వార్ కేసులో ప‌లువురు అరెస్టు

విజ‌య‌వాడ క్రైం‌, సెల్ఐటి న్యూస్‌: ఇటీవ‌ల విజ‌య‌వాడ అజిత్‌సింగ్‌న‌గ‌ర్ ప‌రిధిలో జ‌రిగిన ‌గ్యాంగ్‌వార్‌కు సంబంధించి పాత క‌క్ష‌లే కార‌ణ‌మ‌ని నార్త్ ఏసీపీ షేక్ ష‌ర్పుద్దీన్ తెలిపారు. గ్యాంగ్ వార్‌పై మంగ‌ళ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. అజిత్‌సింగ్‌న‌గర్, సత్యనారాయణపురం పరిధిలో గంజాయి సేవించే వారు, బ్లెడ్ బ్యాచ్ అధికంగా ఉన్నారు. కేదారేశ్వరపేట ఖుద్దూస్‌నగర్‌కు చెందిన షేక్‌ నాగుల్‌మీరా(మున్నా), రాహుల్‌ అనే యువకుల మధ్య పాత గొడవ. గత నెల 31న రాహుల్‌తో పాటు అయోధ్యనగర్‌కు చెందిన వినయ్‌ తదితరులు కేదారేశ్వరపేటలో కత్తులు, కర్రలతో నాగుల్‌మీరా వర్గంపై దాడికి పాల్పడ్డారు. అయోధ్యనగర్‌కు చెందిన పుట్టా వినయ్‌ (18) ఈ నెల 9వ తేదీన తనపై ఖుద్దూస్‌నగర్‌కు చెందిన షేక్‌ నాగుల్‌మీరా(25), న్యూరాజరాజేశ్వరీపేటకు చెందిన షేక్‌ ఈసబ్‌ (26), బుడమేరు మధ్యకట్ట ప్రాంతానికి చెందిన లావేటి సాయికుమార్‌(24), సీతన్నపేటకు చెందిన నాగులాపల్లి సాయి పవన్‌(20), కృష్ణలంకకు చెందిన కంది సాయికుమార్‌ (20)తో పాటు మరికొందరు దాడికి పాల్పడ్డారు. పుట్టా వినయ్‌ ఫిర్యాదు చేసినవారిలో నాగుల్‌మీరా, ఈసబ్‌, సాయికుమార్‌, సాయిపవన్‌, కంది సాయికుమార్‌లతో పాటు మరో ఇద్దరు బాలలను సోమవారం అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. అరెస్టు చేసిన వారి నుంచి ఓ ద్విచక్రవాహనం, కత్తులు స్వాధీనం.  ఖుద్దూస్‌నగర్‌కు చెందిన రాహుల్‌, పటమటకు చెందిన సాయికిరణ్‌, అయోధ్యనగర్‌కు చెందిన పుట్టా వినయ్‌, వికాస్‌ అనే యువకులను అరెస్టు. వీరి నుంచి సైతం  కత్తులు స్వాధీనం చేసుకుని, మరో ఐదుగురు కోసం గాలిస్తున్నాం.

 

Just In...