Published On: Thu, Nov 1st, 2018

గ్యాస్ బండ‌.. ఇక గుది బండ‌..

* పెరిగిన వంటగ్యాస్ ధరలు!

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: ఇప్పటికే పెట్రోలు, డీజిల్ ధరలతో సతమతమవుతున్న సామాన్యుడికి.. వంటగ్యాస్ ధర పెంపు రూపంలో మరో పిడుగు ప‌డింది. ఈ మేరకు వంటగ్యాస్ ధరలను పెంచుతూ ఆయిల్ సంస్థలు గురువారం నిర్ణయం తీసుకున్నాయి. సబ్సిడీ సిలిండర్ ధర రూ.66, సబ్సిడీయేతర సిలిండర్ ధర రూ.97 వరకూ అమాంతం పెంచేశాయి. తాజా పెరుగుదలతో సబ్సిడీ వంటగ్యాస్ సిలిండర్ ధర రూ.967.50, సబ్సిడీయేతర సిలిండర్ ధర రూ.1703.50లకు చేరుకుంది. గత ఆరు నెలల కాలం నుంచి గ్యాస్ ధరలు తరచూ పెరుగుతూనే ఉన్నాయి తప్పించి త‌గ్గడం లేదు. వంట గ్యాస్ ధరల పెంపుదలపై సామాన్య ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.

Just In...