Published On: Fri, Oct 30th, 2020

గ్యాస్ బుకింగ్‌కు జాతీయ‌స్థాయిలో ఒక‌టే నంబ‌ర్‌

* న‌వంబ‌రు 1నుంచి అందుబాటులోకి…

* ఐఓసి డీజీఎం ఫుల్‌జిలె వెల్ల‌డి

విజ‌య‌వాడ, సెల్ఐటి న్యూస్‌‌: ఇండియ‌న్ ఆయిల్ కార్పొరేష‌న్ ఎల్పీజీ రీఫిల్ బుకింగ్ చేసుకునేందుకు దేశ‌వ్యాప్తంగా ఒకే నంబ‌రును న‌వంబ‌రు 1వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నట్లు ఇండియ‌న్ ఆయిల్ కార్పొరేష‌న్ లిమిటెడ్ డిప్యూటీ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ ఎల్‌.పి.ఫుల్‌జిలె తెలిపారు. విజ‌య‌వాడ భార‌తీన‌గ‌ర్‌లో ఉన్న ఐఓసీ కార్యాల‌యంలో శుక్ర‌వారం విలేక‌రుల స‌మావేశం ఏర్పాటు చేశారు. ఈ సంద‌ర్భంగా ఫుల్‌జిలె మాట్లాడుతూ ఇప్ప‌టివ‌ర‌కు ప్రాంతాల వారీగా రీఫిల్ బుకింగ్ చేసుకునేందుకు వివిధ ఫోన్ నంబ‌ర్లు ఉండేవ‌ని తెలిపారు. అయితే న‌వంబ‌రు 1వ తేదీ నుంచి ఒకే మొబైల్ నంబ‌రు ద్వారా దేశ వ్యాప్తంగా రీఫిల్‌ను బుకింగ్ చేసుకునే అవ‌కాశం క‌ల్పిస్తున్నామ‌ని పేర్కొన్నారు, 7718955555 ఫోన్ నంబ‌రు ద్వారా 24 గంట‌లు పాటు రీఫిల్‌ను బుకింగ్ చేసుకునే సౌల‌భ్యం వినియోగ‌దారుల‌కు అందుబాటులో ఉంటుంద‌ని తెలిపారు. అలాగే 7588888824 ఫోన్ నంబ‌రుకు వాట్సాప్ ద్వారా రీఫిల్‌ను బుకింగ్ చేసుకోవ‌చ్చ‌ని చెప్పారు. పేటీఎం, అమెజాన్‌, గూగుల్ పే ద్వారా బుకింగ్ మ‌రియు చెల్లింపులు చేసుకోవ‌చ్చ‌ని చెప్పారు. వీటికి సంబంధించి ఇత‌ర వివ‌రాలు https://cx.indianoil.in ద్వారా డౌన్‌లోడ్ చేసుకుని వివ‌రాలు తెలుసుకోవ‌చ్చ‌ని వెల్ల‌డించారు. విలేక‌రుల స‌మావేశంలో ఐఓసి కృష్ణాజిల్లా సేల్స్ మేనేజ‌ర్ జి.వి.వి.ముక్తేశ్వ‌ర‌రావు, ఎల్‌పిజి డిస్ట్రిబ్యూట‌ర్ కృష్ణా జిల్లా అధ్య‌క్షులు కోన శ‌ర‌త్‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎల్‌పిజి డీల‌ర్స్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు సీహెచ్ శంక‌ర్ పాల్గొన్నారు. 

Just In...