Published On: Sat, Oct 17th, 2020

గ్రామాల్లో పరిశుభ్రత పట్ల ఉదాసీనత వద్దు

* కలెక్టర్ ఏయండి ఇంతియాజ్

పామర్రు, సెల్ఐటి న్యూస్‌: గ్రామాల పరిశుభ్రతో లో ఉదాసీనంగా వ్యవహరిస్తే సబందిత అధికారులును ఉపేక్షించేది లేదని కృష్ణా జిల్లా కలెక్టర్ ఏయండి ఇంతియాజ్ హెచ్చరించారు. శనివారం పామర్రు గ్రామ సచివాలయంలోఆకస్మికంగా తనిఖీ చేశారు. సమీపంలోని మురుగు డ్రైన్ అద్వానంగా ఉండటంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు రహదారి ఆక్రమణ గురికావడంతో తొలగించాలని సూచించారు. ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇతరత్రా ప్రభుత్వ సేవలు సత్వరం అందించేందుకు సచివాలయ ఉద్యోగ సిబ్బంది అంకితభావం తో పనిచేయాలన్నారు. గ్రామాల్లో పారిశుధ్యం, ఇతర ప్రజా సమస్యలపై ఫిర్యాదులు వస్తే ఎంత మాత్రం సహించేది లేదని స్థానిక పంచాయతీ అధికారులను హెచ్చరించారు. కార్యక్రమంలో పంచాయతీ అధికారులు వెలుగు ఏపిఎం ప్రధానరావు తదితరులు పాల్గొన్నారు.

Just In...