Published On: Wed, Dec 4th, 2019

గ్రామ స‌చివాల‌యాల నిర్మాణ ప‌నులు వెంట‌నే ప్రారంభించాలి

* వీసీలో జిల్లా క‌లెక్ట‌ర్ల‌కు మంత్రి పెద్దిరెడ్డి ఆదేశాలు

అమ‌రావ‌తి, సెల్ఐటి న్యూస్‌: రాష్ట్రంలో గ్రామ స‌చివాల‌యాలు, ఉపాధి హామీ ప‌నుల‌ను వెంట‌నే ప్రారంభించాల‌ని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ది శాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీడియో కాన్ఫరెన్స్ (వీసీ)లో జిల్లాల క‌లెక్ట‌ర్ల‌ను ఆదేశించారు. బుధ‌వారం ఆయ‌న ఉపాధి హామీ ప‌నుల‌పై స‌చివాల‌యం నుంచి వీసి నిర్వ‌హించారు. కార్య‌క్ర‌మంలో పంచాయతీ రాజ్‌ కమిషనర్‌ గిరిజాశంకర్‌, పలువురు అధికారులు, జిల్లాల నుంచి కలెక్టర్లు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ఉపాధి హామీ పనులపై జిల్లా కలెక్టర్‌ లకు ఆదేశాలు. – రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సచివాలయాలతో పాటు ఇతర ఉపాధి హామీ పనులు తక్షణం ప్రారంభించాలి. – అన్ని పనులకు ఈనెల 15 నాటికి పరిపాలనా అనుమతులు ఇవ్వాలి. ఈ నెల 18 తేదీలోగా సాంకేతిక అనుమతి అందించాలి. 21 నాటికి గ్రౌండ్ లో పెగ్ మార్కింగ్ ఖచ్చితంగా జరగాలి. డిసెంబర్‌ 31 నాటికి ఎఫ్ టి ఓ అప్ లోడ్ జరగాలి. గ్రామాల్లో అత్యంత ప్రాధాన్యతా క్రమంగా అయిదు పనులు.మొదటి దశలో గుర్తించిన గ్రామ సచివాలయ భవనాల నిర్మాణం. ప్రాధాన్యతా క్రమంలో సిసి డ్రైనేజీలు. ఉగాది నాటికి అందించే ఇళ్ళ స్థలాలకు సంబంధించి మెరక పనులు. మనబడి నాడు-నేడు కింద గుర్తించిన పాఠశాలల ప్రహరీ గోడల నిర్మాణం. నిర్లక్ష్యానికి గురైన గ్రామాల్లో చేపట్టాల్సిన సిసి రోడ్ల నిర్మాణం. ఈ పనులను ప్రాదాన్యతగా ప్రారంభించాలి. జిల్లాల్లో ఉపాది హామీపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదు. పనుల విషయంలో… నాణ్యతలో రాజీ పడవద్దు. నరేగాలో భాగంగా నాడు-నేడు స్కూళ్లకు ప్రహరీ నిర్మాణాలకు నిధులను కేటాయిస్తున్నాం. ఆర్ డబ్ల్యుఎస్‌ కింద వున్న వాటర్‌ హెడ్ ట్యాంక్ లకు రంగులు వేయాలి. గ్రామీణ ప్రాంతాల్లో సిసి డ్రైన్ లు పూడిపోకుండా కవరింగ్ పనులు కూడా చేపట్టాలి. సక్రమంగా పనులు చేసే కాంట్రాక్టర్ లకు వెంటనే బిల్లుల చెల్లింపు జరిగేలా చర్యలు తీసుకోవాలి. ఈ పనులకు సంబంధించి బిల్లులు పెండింగ్ లేకుండా చూస్తాం.
– ప్రతి నియోజకవర్గంకు రూ.15 కోట్లు ఇప్పటికే కేటాయించాం. ఈ నిధుల నుంచి జరిగిన పనులకు వెంటనే మూడు విడతల్లో బిల్లులు చెల్లించాలి. ఇసుక పాలసీలో భాగంగా చెక్ పోస్ట్ ల విషయంలో కలెక్టర్ లు బాధ్యత వహించాలి. జిల్లా ఎస్పీలతో సమన్వయం చేసుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా 91 చెక్ పోస్ట్ లు సిద్దమయ్యాయి. ఇంకా 242 చెక్ పోస్ట్‌లు పూర్తి కావాల్సి వుంది. ఆర్థిక భారం లేకుండా అన్ని నిధులు ఇస్తున్నాం. ప్రభుత్వ నిర్ణయాలకు అనుగుణంగా కలెక్టర్ లు సమన్వయం చేసుకుని పనిచేయాలి.

 

Just In...