Published On: Mon, Nov 4th, 2019

గ‌త ప్ర‌భుత్వానిది అంతా ప్ర‌చార ఆర్భాట‌మే…

* పున్నమి ఘాట్ ప్రాంతం లో పర్యటించిన మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ‌: గత టిడిపి ప్రభుత్వం ప్రచారంపై చూపిన శ్రద్ధ అభివృద్ది పై చూపలేదని దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. సోమవారం ఆయా శాఖల అధికారులతో కలిసి మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు నగరంలో పలు ప్రాంతాల్లో పర్యటించారు. తొలుత పశ్చిమ నియోజక వర్గంలోని 27వ డివిజన్ పున్నమి ఘాట్ తదితర ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి స్థానికులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా త‌మ ప్రాంతంలో విద్యుత్, తాగు నీరు వంటి పలు సమస్యలను స్థానికులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. నగర అభివృద్దికి దశల వారీగా అభివృద్ది పనులు చేపడుతున్నామని త్వరలోనే సమస్యల శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తా అని మంత్రి బరోసా ఇచ్చారు. పర్యటనలో జిల్లా కలెక్టర్ ఏ.ఎం.డిఇంతియాజ్, నగరపాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్, ఎమ్మార్వో సుగుణ, వైసీపీ డివిజన్ అధ్య‌క్షుడు ఆంజనేయ రెడ్డి, వైసీపీ నేత‌లు జీఎంసి బాషా తదితరులు పాల్గొన్నారు.

Just In...