Published On: Sat, May 12th, 2018

గ‌న్న‌వ‌రం విమానాశ్ర‌యం వ‌ద్ద 144 సెక్ష‌న్‌

* సీపీ గౌతం స‌వాంగ్ ఉత్వ‌ర్వులు జారీ

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ క్రైం: వీఐపీల రాకపోకలతో పాటు భద్రతా కారణాల రీత్యా గన్నవరం విమానాశ్రయం వద్ద 144 సెక్షన్ విధిస్తూ విజయవాడ నగర పోలీసు కమిషనర్ డి.గౌతం సవాంగ్ శుక్ర‌వారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్ర‌మంలో శ‌నివారం నుంచి 55 రోజుల పాటు అంటే.. జూలై 4వ‌ తేదీ వరకూ ఈ నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని ఆయ‌న వెల్లడించారు. గన్నవరం విమానాశ్రయంతో పాటు పరిసర ప్రాంతాల్లోని 250 మీటర్ల పరిధిలో 144 (20) సెక్షన్ అమల్లో ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కోన్నారు. శాంతిభద్రతలతో పాటు అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ఈ ఆదేశాలు జారీ చేసినట్టు పోలీసు కమిషనర్ గౌతం సవాంగ్ వెల్లడించారు.

Just In...