Published On: Sat, Apr 20th, 2019

చంద్రబాబుకు మోదీ, జగన్‌ శుభాకాంక్షలు

సెల్ఐటి న్యూస్‌, అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు ప్రధాని నరేంద్రమోదీ ట్విటర్‌ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో కలకాలం జీవించాలని ఆకాంక్షించారు. ప్రతిపక్ష నేత జగన్మోహ‌న్ రెడ్డి కూడా ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా శ‌నివారం పార్టీ కార్యాలయాల్లో చంద్రబాబు జన్మదిన వేడుకలు ఘ‌నంగా నిర్వ‌హించారు.

Just In...