Published On: Fri, Feb 14th, 2020

చంద్ర‌బాబు, లోకేష్‌ల‌ను అరెస్టు చేయాలి…

* వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు

తాడేప‌ల్లి, సెల్ఐటి న్యూస్‌: తెదేపా అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శిపై ఐటి దాడుల్లో ప్రాధమిక సాక్ష్యాధారాలు దొరికాయి కాబట్టి చంద్రబాబు,లోకేష్‌లను వెంటనే అరెస్ట్ చేయాలి వైసీపీ ఎమ్మెల్యే అంబ‌టి రాంబాబు పేర్కొన్నారు.వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో అంబ‌టి రాంబాబు శుక్ర‌వారం మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శిపై దాడులు జరిగితే రూ.2 వేల కోట్లు బయటపడ్డాయంటే చంద్రబాబు,లోకేష్‌ల‌ను విచారిస్తే ఎన్ని లక్షల కోట్లు బయటపడతాయో అని అనుమానం వ్య‌క్తం చేశారు. చంద్రబాబు సన్నిహితులపై ఐటి దాడులలో కీలక ఆధారాలు లభించాయి. తన సన్నిహితులపై ఐటి దాడులు జరిగితే చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదు. ఐటి, ఈడి రాష్ర్టంలోకి రాకుండా చంద్రబాబు అడ్డుకున్నారు. చంద్రబాబు మాజి పిఎస్ వద్ద కీలక ఆధారాలు సేకరించారు. చంద్రబాబు పాపం పండింది.వ్యవస్దలను మేనేజ్ చేయడానికే హైద్రాబాద్ వెళ్లారు.చంద్రబాబు,లోకేష్‌లు హైద‌రాబాద్‌లో త‌లదాచుకుంటున్నారు. దొరికిపోయారు కాబట్టే చంద్రబాబు, లోకేష్‌లు నోరు మెదపడంలేదు. లెక్కలు చూపని రూ.2 వేల కోట్లు దొరికినట్లు ఐటి చెప్పింది. చంద్రబాబు దోపిడీకి పాల్పడ్డారని మేం మొదటి నుంచి చెబుతూనే ఉన్నాం. ఇన్నాళ్లు కోర్టులు, వ్యవస్దలను మేనేజ్ చేస్తూ వచ్చారు. ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు చంద్రబాబు వ్యవస్దలను మేనేజ్ చేయడం చూశాం. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారు.
గతంలో కేంద్రంపై యుధ్దం చేస్తున్నట్లు ఘీంకారాలు పలికారు. చంద్రబాబు,ఆయన తాబేదార్లపై ఐటిదాడులు జరిగితే ఈ దాడులపై ఎల్లో మీడియా మాత్రం వార్తలు రాయడం లేదు. లోకేష్ సన్నిహితుడు కిలారు రాజేష్ పై కూడా ఐటి దాడులు జరిగాయి. చంద్రబాబు, నిప్పు కాదు తుప్పు. చంద్రబాబు, లోకేష్ బినామీలందరిపై ఐటి దాడులు జరిగాయి. ఐటి సోదాలపై పవన్ కల్యాణ్ ఎందుకు నోరుమెదపడం లేదు. ప్యాకేజీలు తీసుకుని రాజకీయం చేస్తారా. వీళ్లా ప్రజలను ఉధ్దరించేది. సిపిఐ రామకృష్ణకు ఏ తేలు కుట్టింది. ఇప్పుడే తీగ లాగారు… డొంక త్వరలోనే కదులుతుంది. నిత్యం నీతి వాక్యాలు మాట్లాడే పవన్ కల్యాణ్ ,రామకృష్ణలు ఏమయ్యారు అని ప్ర‌శ్నించారు.

Just In...