Published On: Thu, Mar 14th, 2019

చిత్తూరులో భారీగా నగదు పట్టివేత

సెల్ఐటి న్యూస్‌, క్రైం డెస్క్‌: చిత్తూరు జిల్లాలో భారీగా నగదు పట్టుబడింది. వడమాలపేట టోల్‌ప్లాజా వద్ద గురువారం నిర్వహించిన తనిఖీల్లో టాటా ఏస్‌ వాహనంలో తరలిస్తున్న రూ.1.09 కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నగదుతో పాటు కొన్ని క్రీడా సామగ్రిని కూడా పోలీసులు సీజ్‌ చేశారు. ఎన్నికల నేపథ్యంలో చేపట్టిన తనిఖీల్లో ఈ నగదు ప‌ట్టుబడింది. తమిళనాడు నుంచి తిరుపతి తరలిస్తుండగా పోలీసులు వీటిని పట్టుకున్నారు.

Just In...