Published On: Sat, Nov 9th, 2019

చిత్తూరు జిల్లాలో కంటైనర్‌ బీభత్సం…12 మంది దుర్మ‌ర‌ణం

సెల్ఐటి న్యూస్‌, చిత్తూరు క్రైం: చిత్తూరు జిల్లాలో శుక్ర‌వారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందారు. జిల్లాలోని బంగారుపాళ్యం మండలం మొగిలిఘాట్‌ దగ్గర కంటైనర్‌ బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో 9 మంది మృతి చెందారు. ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. కంటైనర్ డివైడర్‌ ఢీకొని వాహనాలపైకి దూసుకెళ్లింది. ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది మృతి చెందారు. కంటైనర్‌ కింద ఆటో, ఓమ్నీ వ్యాన్‌, బైక్‌ ఇరుక్కున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మృతులు గంగవరం మండలం మర్రిమాకులపల్లి వాసులుగా గుర్తించారు. మృతులు రాము, రామచంద్ర, సావిత్రమ్మ, ప్రమీల, గుర్రమ్మ, నరేంద్ర, శేఖర్, పాపమ్మలుగా పోలీసులు గుర్తించారు.

Just In...