Published On: Wed, Sep 13th, 2017

చిత్రం.. సందేశం…!

* ఆంధ్రా ల‌యోలా క‌ళాశాల విద్యార్థుల సృజ‌నాత్మ‌క‌త‌

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ ఎడ్య‌కేష‌న్‌: ఆంధ్రా లయోల కళాశాల విజువల్‌ కమ్యునికేషన్‌ విభాగం ఆధ్వర్యంలో ‘మాదక ద్రవ్యాలపై పోరాటాలు’ అంశంపై సోమవారం ఫేస్‌ పెయింటింగ్‌ పోటీలు నిర్వహించారు. మాదక ద్రవ్యాలు, వ్యసనాల పర్యవసనాల వ‌ల్ల క‌లిగే అన‌ర్థాల‌ను ఉదహరిస్తూ చ‌క్క‌ని సందేశాన్ని చాటారు. చెడు వ్య‌స‌నాల‌కు బానిస కావొద్దంటూ విద్యార్థులు సృజనాత్మకతతో గీసిన చిత్రాలు ప్ర‌తి ఒక్క‌రినీ ఆలోచింపజేశాయి. కార్యక్రమాన్ని విజువల్‌ కమ్యునికేషన్‌ విభాగం సమన్వయకర్త కె.వి.విజయబాబు, అధ్యాపకులు పర్యవేక్షించారు. నగరంలోని పలు కళాశాలలకు చెందిన విద్యార్థులు పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.

loyola_visual_communications_1

Just In...