Published On: Tue, Aug 4th, 2020

చిన్నారి హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు

* నిందితుడికి ఉరి శిక్ష విధింపు

విజ‌య‌వాడ క్రైం, సెల్ఐటి న్యూస్‌: కృష్ణా జిల్లా చిన్నారి హత్య కేసులో జిల్లా కోర్ట్ సంచలన తీర్పు వెలువ‌రించింది. ఒక మైనర్ బాలికను కిడ్నాప్ చేసిన హత్య చేసిన నిందుతుడికి ఉరి శిక్ష విధించింది. 2019 నవంబర్ 10న విజయవాడలో ద్వారక అనే బాలిక అపహరణ జ‌రిగింది. ద్వారకను అపహరించి హత్య చేసిన నిందితుడు పెంటయ్య. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన విజయవాడ పోలీసులు. పెంటయ్య నేరానికి పాల్పడినట్లు చార్జిషీట్. నేరం రుజువు కావడంతో పెంటయ్యకు ఉరిశిక్ష ఖరారు చేసిన కోర్ట్. గతంలో తోటి విద్యార్థినిని అతి కిరాతకంగా హత్య చేసిన మనోహర్ అంశంలోనూ ఉరి శిక్ష విధించిన కోర్ట్.

Just In...