Published On: Sat, Nov 3rd, 2018

చిన్న పరిశ్రమల నిర్వహణకు బ్యాంకు రుణాలు సులభతరం

* ఛాంబర్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అవగాహన 

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ‌: చిన్న‌, మధ్య తరహా, లఘు పరిశ్రమలు స్థాపించే వారికి బ్యాంకు రుణాలు సులభతరంగా అందించనున్నామని, వ్యాపార నిర్వహణను బట్టి కేవలం 21 రోజుల్లోనే రుణాలను మంజూరు చేయనున్నట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ సాహూ తెలిపారు. ది ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో సూర్యారావుపేటలోని ఓహోటల్లో చిన్న, లఘు పరిశ్రమలకు సంబంధించి రుణ సంబంధిత విషయాలను అవగాహన కల్పిస్తూ శుక్రవారం ఉదయం సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా అరుణ్‌కుమార్ సాహూ మాట్లాడుతూ సాదారణంగా కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునేవారు చాలా మంది బ్యాంకు రుణాలకు వస్తుంటారన్నారు. అయితే పూర్తిస్థాయిలో డాక్యుమెంట్లు ఇవ్వకపోవడం కారణంగానే బ్యాంకులు బుణాలు మంజూరు చేయడంలో ఆలస్యమవుతుందన్నారు. బ్యాంకు నిబంధనలకు సంబంధించి అన్ని డాక్యుమెంట్లు సక్రమంగా ఉంటే బుణాలు తక్షణమే మంజూరు చేస్తామన్నారు. అలాగే బ్యాంకు బుణాలు ఎలా పొందాలనే దానిపై కూడా తమ సిబ్బంది ఛాంబర్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాలలో అవగాహనా సదస్సులను నిర్వహిస్తున్నామన్నారు. ఎస్‌బీఐ ఆధ్వర్యంలో చిన్న మధ్య తరహా, లఘు పరిశ్రమలు స్థాపించే వారికి బుణాలను అందించడంలో ప్రథమ స్థానంలో ఉందన్నారు. ఫెడరేషన్ జాయింట్ డైరెక్టర్ సుజాత మాట్లాడుతూ చిన్న, మధ్య తరహా, లఘు పరిశ్రమలు స్థాపించాలనుకునే వారికి, యువ పారిశ్రామికవేత్తలకు బ్యాంకు బుణాలపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ సెమినార్‌ను నిర్వహించినట్లు తెలిపారు. చాలా మంది కొత్తగా వ్యాపారం ప్రారంభించలనుకున్నా బ్యాంకు రుణాలు మంజూరు కావడంలో కొంత ఇబ్బందులు పడుతున్నారని, దీనితో వ్యాపారా ప్రారంభానికి తీవ్ర అసౌకర్యం కలుగుతుందన్నారు. అటువంటి వారికి బ్యాంకు బుణాలు ఎలా ధరఖాస్తుచేసుకోవాలి, బుణం పొందిన తరువాత వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలనే దానిపై యువ పారిశ్రామికవేత్తలకు బ్యాంకు అధికారులు, వివిధ ప్రముఖ వ్యాపారస్తులతో అవగాహనా సదస్సు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఫెడరేషన్ మేనేజింగ్ కమిటీ సభ్యులు ఎ.ఆంజనేయులు, దళిత్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షులు కె.వి.రమణారావు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

Just In...