Published On: Sat, Aug 1st, 2020

చీరాల టూటౌన్ ఎస్సై విజయ్‌కుమార్ అరెస్ట్

చీరాల క్రైం, సెల్ఐటి న్యూస్‌: చీరాల టూటౌన్ ఎస్సై విజయ్‌కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. గత నెల 18న మాస్క్ పెట్టుకోలేదని యువకుడిపై ఎస్సై దాడి చేశాడు. తలకు తీవ్రంగా గాయం కావడంతో కిరణ్‌కుమార్ అనే యువకుడు మృతి చెందాడు. యువకుడు మృతిపై గుంటూరు అడిషనల్ ఎస్పీ గంగాధర్ విచారణ చేపట్టారు. ఇప్పటికే ఎస్సై విజయ్‌కుమార్‌ను ఎస్పీ సిద్దార్థ కౌశల్ సస్పెండ్ చేశారు.

 

Just In...