Published On: Sat, Aug 19th, 2017

చెన్నై వారి “ఆహ్వానం” డిజైనర్ ఫెయిర్ ప్రారంభం

* ఆకట్టుకుంటున్న ఇమిటేష‌న్ జ్యూయలరీ, బ్రెడెల్ శారీస్

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ‌: విజ‌య‌వాడ మొగ‌ల్రాజ‌పురంలోని స్థానిక అమ్మా ఫంక్షన్ హాల్‌లో చెన్నై వారి “ఆహ్వానం” డిజైనర్ ఫెయిర్ శ‌నివారం ప్రారంభ‌మైంది. ఈ సంద‌ర్భంగా సమ‌నా ఇనిస్టిట్యూట్ ఛైర్మన్ ఎమ్.సమ‌నా ప్రారంభించారు. ఈ సందర్భంగా సమ‌నా మాట్లాడుతూ నేటి యువత ఫ్యాషన్ డిజైనింగ్ పై ఆసక్తి పెంచుకుంటుందన్నారు. ఈ క్రమంలోనే నూతన రాజధానిగా విజయవాడ ఏర్పడిన తరువాత మెట్రోసిటీస్ దీటుగా ఫ్యాషన్ డిజైనర్స్ వారి ఉత్పత్తులను నగర ప్రజలకు పరిచయం చేసేందుకు ఇలాంటి ప్రదర్శనలను నిర్వహించడం గొప్ప విషయం అన్నారు. నిర్వాహకురాలు కోహ్లి జస్నీత్ కౌర్ మాట్లాడుతూ 10 సంవత్సరాల నుండి సౌత్లో ప్రదర్శన, అమ్మకాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. డిల్లీ, ముంబాయి, కొలకత్తా, జైపూర్, బెంగళూర్, హైదరాబాద్, చెన్నై వంటి నగరాల్లో ప్రసిద్ధి చెందిన ఫ్యాషన్ హౌస్ వారి డిజైనర్ల ఉత్పత్తులను ఈ ప్రదర్శనలో ఉంచినట్లు తెలిపారు. తక్కువ ధరలలో నాణ్యమైన వస్తాను అందించడం వలనే తమ ఫెయిర్కు మంచి పేరు వచ్చిందన్నారు. ఇమిటేషన్ జ్యూయలరీ, డిజైనర్ చీరెలు, బ్రెడిల్స్ శారీస్, పార్టీవేర్ శారీస్, హ్యాండూమ్ శారీస్, డిజైనర్ బ్లాజెస్, సిల్వర్ ఆర్థికల్స్, డ్రెస్ మెటీరియల్స్, సల్వార్స్, చిన్నపిల్లల దుస్తులు, బెనారస్, హాఫ్ శారీస్, లెదర్ బ్యాగ్స్, ఫర్నిషింగ్ సూపర్నెట్, కష్మీరీ శిల్క్ ఆర్టిఫిషియల్ ప్లవర్స్, చున్నీస్, రాజస్థానీ బెడ్షీట్స్, చెప్పల్స్, హ్యాండ్ బ్యాగ్స్, లెగ్గింగ్స్ యాక్ససరీస్, లైఫ్ స్టయిల్స్కు చెందిన ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయన్నారు. ఈ ప్రదర్శన, అమ్మకాలు 20వ తేదీ రాత్రి 9 గంటల వరకు కొనసాగుతుందని జస్నీత్ కౌర్ తెలిపారు. ఈ అవకాశాన్ని నగర ప్రజలు, ఆడపడుచులు, యువతులు సద్వినియోగం చేసుకోవాల‌ని కోరారు. ప్రారంభోత్సవంలో చర్మవాధుల నిపుణులు డాక్టర్ పి.రాంబాబు, కోహ్లి బ్రహమ్జోత్ సింగ్, కోహ్లి దేదార్ సింగ్, కోహ్లి గగన్ ప్రీత్ కౌర్, ఫౌజియా తరుణమ్ తదితరులు పాల్గొన్నారు.

aahwanam_jewellry_expo_2 aahwanam_jewellry_expo_1 aahwanam_jewellry_expo_3

Just In...