Published On: Thu, Jan 9th, 2020

జగనన్న అమ్మఒడి పథకం దేశంలోనే చరిత్రాత్మకం

* రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్ బి అంజాద్ బాష.

* చదువే నిజమైన ఆస్తి

* పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

* పండుగ వాతావరణంలో జరిగిన జగనన్న అమ్మఒడి

సెల్ఐటి న్యూస్‌, కడప: నిరుపేద విద్యార్థుల తల్లిదండ్రుల కలలను సాకారం చేయడానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని, ఈ పథకం దేశంలోనే ఒక చరిత్రాత్మకమని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్ బి అంజాద్ బాష అన్నారు. గురువారం ఉదయం జిల్లా కేంద్రంలోని స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ ఉర్దూ బాలుర హై స్కూల్ లో “జగనన్న ” కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి డిప్యూటీ సీఎం లాంఛనంగా ప్రారంభించారు. అమ్మవడి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన ముందుగా దివంగత మహానేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూల మాలలు పుష్పాలు అర్పించి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ….. నేడు రాష్ట్రవ్యాప్తంగా జగనన్న అమ్మ ఒడి కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో ప్రభుత్వం నిర్వహిస్తోందని చెప్పారు. కుల మతాలకు వర్గాలకు అతీతంగా చేసుకునే పండుగ జగనన్న అమ్మ ఒడి కార్యక్రమం. నేడు రాష్ట్రంలోని 43 లక్షల మంది తల్లులకు  6450 కోట్ల రూపాయలను అకౌంట్ లోకి జమ చేయడం జరుగుతుందని చెప్పారు. ఎన్నికల ముందు ముఖ్యమంత్రి చేసిన తన సుదీర్ఘ  ప్రజా సంకల్ప యాత్రలో అనేక మంది తల్లులు మహిళలు విద్యార్థినీ విద్యార్థులను కలుసుకునే మాట్లాడారని, ఆర్థిక పరిస్థితి సరిగా లేక ఎక్కువ మంది పిల్లలు మధ్యలో బడి మానివేసిన విషయం, డబ్బులు లేక పిల్లలను సాధించలేక పోతున్నామని తల్లులందరూ ఆయన దృష్టికి తీసుకు రావడం వల్ల అమ్మ ఒడి కార్యక్రమానికి ముఖ్యమంత్రి  శ్రీకారం చుట్టారని చెప్పారు. ఇది ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని ఈ అమ్మ ఒడి కార్యక్రమాన్ని దేశంలోని అన్ని రాష్ట్రాలు త్వరలోనే మార్గదర్శకంగా తీసుకునే అవకాశం కూడా ఉందన్నారు. అమ్మ ఒడి అంటే కేవలం 15 వేల రూపాయలు వేయడం కాదు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో అక్షరాస్యతను పెంపొందించడం కూడా ముఖ్యమైన లక్ష్యం అన్నార. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడి నాడు-నేడు కార్యక్రమం ద్వారా కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని 45 వేల ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా చేయాలని, ప్రతి పాఠశాలలో తొమ్మిది రకాల మౌలిక వసతులను తప్పనిసరిగా కల్పించాలని ముఖ్యమంత్రి కృషి చేస్తున్నట్లు చెప్పారు. అలాగే ఇంటర్ డిగ్రీ రెసిడెన్షియల్ కళాశాల కూడా అభివృద్ధి చేయడానికి కూడా పట్టుదలగా ఉన్నారని, రాబోయే మూడు సంవత్సరాలలో దాదాపు 18వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి కార్పొరేటు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలను అభివృద్ధి చేయడం ముఖ్యమంత్రి ఆశయం అన్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలో 1నుండి 6 వరకు ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెడుతున్నారని, ఆ తర్వాత నుంచి ఒక్కొక్క తరగతి చొప్పున పెంచుకుంటూ పూర్తిగా ఇంటర్మీడియట్ వరకు ఆంగ్ల బోధనను చేయడం జరుగుతుందన్నారు. అమ్మ ఒడి కార్యక్రమం లో ప్రభుత్వం అందిస్తున్న పదహైదు వేల రూపాయలను వాటికి ఖర్చు పెట్టకుండా పిల్లల చదువులకు వారి బంగారు భవిష్యత్తు తీర్చిదిద్దడానికి ఖర్చు చేయాలని తల్లిదండ్రులకు సూచించారు. పిల్లలను కేవలం బడికి పంపితే చాలు రెండు జతల బూట్లు, పుస్తకాలు,  యూనిఫారాలు అన్ని ప్రభుత్వమే సమకూరుస్తుందని పనికి పంప రాదని, ఎక్కడ కూడా డ్రాప్ అవుట్ ఉండరాదని చెప్పారు. ఈ ఆరు నెలల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేసిందని, 54 లక్షల మంది రైతులకు ఒక్కొక్కరికి రూ 13500 చొప్పున ఏడు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి ఆర్థిక సహాయం అందించిందని, వాహన మిత్ర కార్యక్రమం ద్వారా ఆటో టాక్సీవాలాలకు 400 కోట్లు  ఆర్థిక సాయం చేయడం జరిగిందని,  నేతన్న నేస్తం కింద చేనేతలకు 24 వేల కోట్లు వారి అకౌంట్ లో వేయడం జరిగిందన్నారు. ఇచ్చిన హామీ మేరకు ఒక కార్యక్రమాన్ని పూర్తి చేస్తూ ముఖ్యమంత్రి ముందుకు వెళుతున్నారని ఇప్పటికే దాదాపు 80 శాతం పైగా హామీలను అమలు చేసినట్లు చెప్పారు. ఇప్పటికే విద్యార్థులకు జగనన్న కంటి వెలుగు కార్యక్రమం కింద కంటి పరీక్షలు నిర్వహించి కళ్ళ అద్దాలు ఇచ్చారని, ఫిబ్రవరిలో ఐదు కోట్ల మంది అవ్వాతాతలకు పరీక్షలు చేసి అద్దాలు అవసరమైన వారికి శస్త్ర చికిత్సలు చేసే కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఈ ఆరు నెలల కాలంలో దాదాపు నాలుగు లక్షల మందికి ఉద్యోగ ఉపాధి కల్పించామని, అగ్రిగోల్డ్ బాధితులకు రూ.రెండు వందల అరవై ఐదు కోట్లు, జూనియర్ అడ్వకేట్ లకు నెలకు 5000  రూపాయలు ఆర్థిక సహాయం అందించినట్లు చెప్పారు. సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని వైయస్సార్ ఆరోగ్యశ్రీని మరింత మెరుగుపరుస్తూ వెయ్యి రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీని వర్తింప చేస్తున్నారని, 1064 ఉన్న ఆరోగ్యశ్రీ సేవలను రెండు వేలకు పైగా పెంపు చేయడం జరిగిందన్నారు.
మత్స్యకారులకు నాలుగు వేల నుంచి 10,000 ఆర్థిక సాయం పెంచారని, బీసీలలో రజకులు దర్జీలు నాయి బ్రాహ్మణులకు కూడా ఆర్థిక సహాయం అందిస్తున్నామని, కాపు నేస్తం ద్వారా మహిళలకు సంవత్సరానికి 15 వేల చొప్పున ఐదు ఏళ్లలో 75000 రూపాయలు ఇవ్వడం జరుగుతుందన్నారు. జిల్లాలో ఇటీవల మూడు రోజుల పాటు పర్యటించిన ముఖ్యమంత్రి 6 వేల కోట్ల రూపాయలతో అనేక అభివృద్ధి పథకాలకు శంకుస్థాపనలు చేశారని, జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి గా రూపొందించడానికి ముఖ్యమంత్రి నిధులు  కేటాయించడం జరిగిందని, 55 కోట్ల తో దేవుని కడప చెరువు అభివృద్ధి చేసి మహనీయుల విగ్రహాలను నెలకొల్ప నున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో రెండవ జాయింట్ కలెక్టర్ బి శివారెడ్డి మాట్లాడుతూ… అమ్మ ఒడి పథకం వినూత్నమైన దని, ఈ పథకం నిరుపేద విద్యార్థులకు చదువుకోడానికి ఎంతో సహాయ పడుతుందన్నారు. పాఠశాల కు వస్తున్న పిల్లలకు మనబడి నాడు నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తుందని, విద్యార్థులకు నాణ్యమైన విద్యను బోధించేందుకు బ్రిడ్జి కోర్సులు, ఆంగ్లంలో బోధనపై ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలు కూడా ప్రభుత్వం అమలు చేస్తున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో సాంఘిక సంక్షేమ కార్యక్రమాలతో పాటు రైతన్నలకు ఆర్థిక భరోసా కార్యక్రమాలు, జలయజ్ఞం కార్యక్రమాలు అనేకం ప్రభుత్వం  అమలు చేస్తోందని చెప్పారు. పాఠశాలలో అక్కడ మీకు విద్యాబోధన ఎలా ఉంది, వసతులు ఎలా ఉన్నాయి, మధ్యాహ్న భోజనం ఏ విధంగా  ఉంది అన్న విషయాలను పేరెంట్స్ కమిటీలు మానిటరింగ్ చేయవచ్చు అన్నారు. పిల్లలు చదువుకోకుండా ఉండరాదని పాఠశాలలో అవసరమైన అన్ని వసతులను ప్రభుత్వం కల్పిస్తోందని, ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చి పాఠశాలలకు పూర్వ వైభవం తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. తల్లిదండ్రులు కూడా పిల్లలకు చదువు కొరకే పంపాలని మరి ఏ ఇతర పనులకు పంపరాదని కోరారు.  కార్యక్రమంలో ఆర్డిఓ మాలోల, డీఈఓ శైలజ, మునిసిపల్ కమిషనర్ లవన్న,  ఎంఈఓ నాగరాజు ప్రసంగించారు. అనంతరం కడప మండలంలోని 20 7705 మంది తల్లులకు ఒక్కొక్కరికి రూ. 15 వేలు చొప్పున మొత్తం రూ.41.55 కోట్ల మెగా చెక్కును విద్యార్థుల తల్లులకు డిప్యూటీ సీఎం అందజేశారు. అంతకు ముందుగా  కార్యక్రమంలో విద్యార్థుల తల్లులతో, విద్యార్థినులతో వారి అనుభవాలను వేదికపై నుంచి సభలో వివరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ డిడి సరస్వతి, ఇంటర్మీడియట్ ఆర్ఐఓ రవి, బీసీ వెల్ఫేర్ అధికారి వెంకటయ్య, ఉర్దూ పాఠశాల హెడ్మాస్టర్ విజయలక్ష్మి, వివిధ పాఠశాలల ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు, వారి తల్లులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

  

Just In...