Published On: Mon, Apr 5th, 2021

“జగనన్న స్మార్ట్ టౌన్” పేరుతో ఇంటి స్థలాలు..

* న‌గ‌ర ప్ర‌జ‌లు స‌ద్వినియోగం చేసుకోవాలి‌
* విజ‌య‌వాడ మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ ప్ర‌స‌న్న వెంక‌టేష్‌
విజయవాడ నగర పాలక సంస్థ, సెల్ఐటి న్యూస్‌: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మధ్య తరగతి ఆదాయ వర్గాల వారికి సొంత ఇంటి కలను సహకారం చేసే దిశగా అడుగులు వేస్తుంది. వారికి “జగనన్న స్మార్ట్ టౌన్” పేరుతో ఇంటి స్థలాలను నగర పాలక సంస్థ పరిధి నుండి ఐదు కిలోమీటర్ల దూరంలోనే అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేయ‌డంతో పాటు సరసమైన ధరలకు ఇంటి స్థలాలు అందచేయనున్న‌ట్లు న‌గ‌ర మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ వి.ప్ర‌స‌న్న వెంక‌టేష్ సోమ‌వారం విడుద‌ల చేసిన ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. విశాలమైన రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, వీధి దీపాలు ఏర్పాటు మరియు పార్కులు, మౌలిక సదుపాయాల కొరకు ప్రత్యేకంగా స్థలం, కమ్యూనిటీ హాల్, పాఠశాల భవనం, ఆరోగ్య కేంద్రం, షాపింగ్ సెంటర్, బ్యాంకు, వార్డ్ సచివాలయం, అంగన్వాడీ కేంద్రం, మార్కెట్, వాకింగ్ ట్రాక్, పిల్లల ఆట స్థలం మొదలగు వాటికి స్థలం కేటాయించుట జరుగుతుంది. నీటి సరఫరా, ఓవర్ హెడ్ ట్యాంక్, విద్యుత్ సబ్ స్టేషన్, ప్లాంటేషన్, సోలార్ ప్యానెళ్లు వంటి సదుపాయం కూడా ఇవ్వనున్నారు. రూ.3లక్షల నుండి రూ.18 లక్షల లోపు సంవత్సర ఆదాయం కలిగిన వారందరూ (ప్రభుత్వ ఉద్యోగులు కూడా) ఈ పథకానికి అర్హులుగా నిర్దేశించారు. 150 చదరపు గజాలకు (3 సెంట్లు) సంబంధించి సంవత్సర ఆదాయ పరిమితి రూ.3 నుండి రూ.6 లక్షలు, 200 చదరపు గజాలకు (4సెంట్లు) సంబంధించి సంవత్సర ఆదాయ పరిమితి రూ.6 నుండి రూ.12 లక్షలు, 240 చదరపు గజాలకు (5 సెంట్లు) సంబంధించి సంవత్సర ఆదాయ పరిమితి రూ.12 నుండి రూ.18 లక్షల వరకు ఉండాల్సి ఉంటుందని కమిషనర్ వి.ప్రసన్న వెంకటేష్ తెలిపారు. దీనిలో భాగంగా సచివాలయ సిబ్బంది ది 6-42021, 7-4-2021న డిమాండ్ సర్వే నిర్వహిస్తున్నందున అర్హులైన నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల‌ని కోరారు.

Just In...