Published On: Fri, Aug 16th, 2019

జగన్మాత దుర్గమ్మకు కంఠాభరణం బహుకరణ..

* అలంకరణ నిమిత్తం ప్రత్యేకంగా తయారుచేయించిన దేవస్థానం వేదపండితులు

సెల్ఐటి న్యూస్, ఇంద్రకీలాద్రి: ఇంద్రకీలాద్రిపై శ్రీదుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో వేదపండితులు అందరూ కలసి జగన్మాత కనకదుర్గమ్మకు అలంకరణ నిమిత్తం ప్రత్యేకంగా తయారుచేయించిన దాదాపు రూ.3 లక్షలుపైగా విలువైన కంఠాభరణాన్ని ఆలయ కార్యనిర్వహణాధికారి వలనుకొండ కోటేశ్వరమ్మకు శుక్రవారం కలిసి అందజేశారు. అనంతరం వేదపండితులు బహుకరించిన కంఠాభరణాన్ని వేడుకగా వెళ్లి అమ్మవారికి అలంకరించారు.

Just In...