Published On: Sun, Jun 23rd, 2019

‘జగన్‌కు ఎలాగో ఇప్పుడు చంద్రబాబుకూ అలానే’

* ప్రజావేదిక చంద్రబాబుదే అనుకోవడం సరికాదన్న మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌

సెల్ఐటి న్యూస్‌, అమరావతి: వైకాపా అధినేత, రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఆయనకు ఎలాంటి అధికారిక నివాసం, గౌరవం కల్పించారో ఇప్పుడు చంద్రబాబుకూ అలాగే కల్పిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అమరావతిలోని ప్రజావేదిక వద్ద తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు మీడియా సమావేశం నిర్వహిస్తున్న సమయంలో బొత్స అక్కడికి వచ్చారు. కలెక్టర్ల సదస్సు నిర్వహణ ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పదవి నుంచి దిగిపోయాక చంద్రబాబు గౌరవంగా వెళ్లిపోవాలని, ప్రజావేదిక తనదే అనుకోవడం ఏంత మాత్రం తగదన్నారు. ప్రజావేదిక చంద్రబాబు సొంత భవనం కాదన్నారు. చంద్రబాబు లేఖ ఇచ్చినా ప్రభుత్వం వచ్చి ఎన్ని రోజులైందని ప్రశ్నించారు. ఈ విషయంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకొనేందుకు సమయం పడుతుందని బొత్స స్పష్టంచేశారు. గతంలో కలెక్టర్ల సదస్సు ప్రజావేదికలో నిర్వహించినందు వల్లే ఇప్పుడూ అక్కడే నిర్వహిస్తున్నట్టు తెలిపారు.

Just In...