Published On: Mon, Sep 27th, 2021

జగన్‌కు మోదీ ఫోన్..

* కేంద్రం నుంచి కావాల్సిన సహకారం అందిస్తామని సీఎంకు హామీ ఇచ్చిన ప్రధాని

అమరావతి, సెల్ఐటి న్యూస్: ఏపీ సీఎం జగన్‌కు ప్రధాని మోదీ ఫోన్ చేశారు. ‘గులాబ్’ తుఫాన్‌ పరిస్థితులపై ప్రధాని మోదీ ఆరా తీసినట్లు తెలుస్తోంది. కేంద్రం నుంచి కావాల్సిన సహకారం అందిస్తామని జగన్‌కు ప్రధాని హామీ ఇచ్చారు. ప్రజలంతా క్షేమంగా ఉండాలని మోదీ ఆకాంక్షించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫాన్‌గా మారింది. దీనికి గులాబ్‌గా నామకరణం చేశారు. ఇది ఉత్తర తూర్పు మధ్య బంగాళాఖాతంలోని గోపాల్‌పూర్‌కి 510 కిలోమీటర్ల తూర్పు ఆగ్నేయ, దిశలో.. కళింగపట్నానికి తూర్పు, ఈశాన్య దిశలో 590 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ తుఫాన్‌ జిల్లాపై తీవ్ర ప్రభావం చూపనున్నట్లు విశాఖపట్నం వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ప్రస్తుతం వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో గులాబ్‌ తుఫాన్‌ కొనసాగుతోంది. గోపాలపూర్‌కు 140 కిలోమీటర్లు, కళింగపట్నానికి 190 కిలోమీటర్లు దూరంలో కేంద్రీకృతమైందని వాతావరణ శాఖ పేర్కొంది. గంటకు 18 కిలోమీటర్ల వేగంతో తుపాను కదులుతోందని అధికారులు ప్రకటించారు. దీని ప్రభావంతో దక్షిణ ఒడిశా, దక్షిణ ఛత్తీస్‌గఢ్, ఉత్తరాంధ్రలో పలుచోట్ల విస్తారంగా వర్షాలు పడుతాయని అధికారులు తెలిపారు.

Just In...