Published On: Tue, Jul 16th, 2019

జగన్‌ తన చెట్టును తానే నరుక్కుంటున్నారు

* మీడియాతో ఇష్టాగోష్టిలో తెదేపా అధినేత చంద్రబాబు

సెల్ఐటి న్యూస్‌, అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహ‌న్ రెడ్డి తన చెట్టును తానే నరుక్కుంటున్నారని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో సీబీఐ విచారణ కావాలని ఎంపీ విజయసాయిరెడ్డి అడిగితే, అవసరం లేదన్నట్లు ఓ కేంద్ర మంత్రి చెప్పారని గుర్తు చేశారు. ఈ సంద‌ర్భంగా మంగ‌ళ‌వారం అసెంబ్లీ లాబీల్లో చంద్రబాబు మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. పోలవరానికి ఫైనాన్స్‌ క్లియరెన్స్‌ రాకపోవడంతో పాటు ఆర్‌అండ్‌ఆర్‌ రాష్ట్ర పరిధిలోనిదేనని కేంద్రం అంటోదని, ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం.. వైకాపా మాట్లాడటం లేదని మండిపడ్డారు. పట్టిసీమ నీళ్లు మచిలీపట్నానికే ఉపయోగపడట్లేదని అంటున్నారని, గోదావరికే కృష్ణా నీళ్లు తీసుకెళ్లినట్లు వైకాపా మాట్లాడుతోందని చంద్రబాబు ఆక్షేపించారు.

Just In...