Published On: Mon, Apr 16th, 2018

జగన్‌ పాదయాత్రతో భూముల ధర తగ్గిపోయింది

* మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్ గుంటూరు జిల్లాలో ప్రజా సంకల్పయాత్ర చేయడం వల్ల రాజధాని రైతుల భూముల విలువ గజానికి రూ.2 నుంచి రూ.3 వేలు వ‌ర‌కు తగ్గిపోయిందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ఈ నెల 21న సీఆర్‌ ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళాకు సంబంధించిన‌ గోడ పత్రికలను మంత్రి ప్ర‌త్తిపాటి ఆదివారం ఉద‌యం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ అమరావతిని భ్రమరావతిగా పోల్చిన జగన్‌కు అక్కడ పాదయాత్ర చేసినప్పుడే జరుగుతున్న అభివృద్ధి కనపడుతుందని అన్నారు. జగన్ అమరావతికి అనుకూలమా? వ్యతిరేకమా? అని తాము అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండానే జిల్లాను దాటేశారని విమర్శించారు.

Just In...