జనసేన బోనాల పాట విడుదల..
సెల్ఐటి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతం బోనాల సందడి నెలకొంది. ఈ సందర్బంగా జనసేన పార్టీ తరఫున రూపొందించిన ప్రత్యేక బోనాల పాటను ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ విడుదల చేశారు. ‘ఏడుగురు అక్కచెల్లెళ్లకు వైభవంగా బోనం..లోకాలనేలే శక్తులకు మహా నైవేద్యం’ అని మొదలయ్యే ఈ పాట ఆకట్టుకుంటోంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబించేలా ఈ పాట ఉంది. పాటలోని ప్రతి పదం బోనాల పండగ ఔన్నత్యాన్ని చాటి చెబుతోంది.