Published On: Thu, Jan 10th, 2019

జన్మభూమిలో పాల్గొన్న ఉద్యోగులకు రెండ్రోజుల సెలవులు

* ఈ నెల 17, 18 తేదీల్లో ప్రత్యేక సాధారణ సెలవులు

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం జరుగుతున్న ఆరో విడత జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో పాల్గొంటున్న ఉద్యోగులకు రెండ్రోజుల సెలవు దినాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయాన్ని ప్రభుత్వ పొలిటికల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 2 నుంచి 11వ తేదీ వరకూ రాష్ట్ర వ్యాప్తంగా ఆరో విడత జన్మభూమి-మా ఊరు కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి అధికారుల నుంచి కింది స్థాయి ఉద్యోగుల వరకూ పాల్గొంటున్నారు. పది రోజుల పాటు అవిశ్రాంతంగా జరుగుతున్న జన్మభూమి – మా ఊరు కార్యక్రమంలో పాల్గొంటున్న ఉద్యోగులు, అధికారులకు మాత్రమే ఈ నెల 17, 18వ తేదీల్లో ప్రత్యేక సాధారణ సెలవు దినాలను మంజూరు చేసిందని ఆ ప్రకటనలో స్టేట్ పొలిటికల్ సెక్రటరీ ముఖేష్‌కుమార్ మీనా తెలిపారు.

Just In...