Published On: Thu, Apr 2nd, 2020

జన్‌ధన్‌ ఖాతాల్లో నగదు ఉపసంహరణపై ఆంక్షలు…

దిల్లీ, సెల్ఐటి న్యూస్‌: దేశంలో కరోనా నియంత్రణ చర్యలో భాగంగా జన్‌ధన్‌ మహిళల ఖాతాల నగదు ఉపసంహరణపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. బ్యాంకులు, ఏటీఎంల వద్ద భారీగా గుమిగూడే అవకాశం అంచనా వేసిన అధికారులు.. ఖాతా చివరన 0 లేక 1 అంకె ఉన్నవాళ్లు ఈ నెల 3న నగదు ఉపంహరించుకొనేందుకు అవకాశం కల్పించారు. అలాగే, ఖాతా చివరన 2 లేదా 3 అంకె ఉన్నవాళ్లయితే ఈ నెల 4న, ఖాతా చివరన 4 లేక 5 అంకె ఉన్నవాళ్లు ఈ నెల 7న; అలాగే, ఖాతా చివరన 6లేక 7 సంఖ్య ఉన్నవాళ్లయితే ఈ నెల 8న, ఎనిమిది లేదా 9 అంకె ఉన్నవాళ్లు అయితే ఈ నెల 9న నగదును ఉపసంహరించుకొనేందుకు అవకాశం కల్పించారు. ఈ నెల 9లోపు నగదు తీసుకోలేని ఖాతాదారులు తర్వాతైనా తీసుకోవచ్చని కేంద్రం తెలిపింది. కరోనా వైరస్‌ ప్రభావం నేపథ్యంలో ప్రధానమంత్రి జన్‌ధన్‌ ఖాతాల్లో 3నెలల పాటు రూ.500 చొప్పున జమ చేస్తున్నట్టు ఇటీవల కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. ఏపీలో జన్‌ధన్ ఖాతాదారుల సంఖ్య 1,18,55,366 ఉండగా.. తెలంగాణలో 52,23,218 మంది ఉన్నారు.

Just In...