Published On: Tue, Jun 12th, 2018

జాతీయ పార్టీల‌తోనే హోదా సాధ్యం

* మాజీ కేంద్ర మంత్రి ప‌ల్లం రాజు

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ‌: ప్రాంతీయ పార్టీలు ప్ర‌త్యేక హోదా సాధించలేవ‌ని, జాతీయ పార్టీల వల్లే హోదా సాద్యం అని మాజీ కేంద్ర మంత్రి ప‌ల్లం రాజు అన్నారు. విజ‌య‌వాడ ఆంధ్ర‌ర‌త్న‌భ‌వ‌న్‌లో మంగ‌ళ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ 13 జిల్లాల అధ్య‌క్షులు, వివిధ విభాగాల నాయకులతో జరిగిన ‌సమావేశంలో ముఖ్య అంశాల‌ను వివ‌రించారు. కాగ్రెస్ కోఆర్జినేషస్ కమిటీ నాయకులతో వ్యక్తిగత సమావేశం ఉమెన్ చాంది నిర్వహించార‌ని తెలిపారు. రాష్ట్రంలో వివిధ పార్టీల‌ స్థితిగతులు, ప్రస్తుతం కాంగ్రెసు పార్టీ పరిస్థితిని తెలుసుకొన్నార‌ని చెప్పారు. ఉమెన్ చాంది అంచలంచెలుగా ఎదిగిన నాయకుల‌న్నారు. పార్టీ సీనియర్ నాయకులను తిరిగి పునరామనం చేయాల‌ని ఆయ‌న కోరిన‌ట్లు పేర్కొన్నారు. పార్టీని తిరిగి ప్రజల్లో చేరేందుకు అంతర్మధనం జరుగుతోంద‌ని తెలిపారు. టీటీడీ, వైసీపీ పార్టీలు హోదా కోసం గట్టిగా కృషి చేయలేక‌పోయార‌న్నారు. ప్రత్యేక హోదా రాష్ట్రానికి ఇస్తామని గుంటూరు సభలోనే రాహుల్ గాంధీ  తెలిపార‌ని గుర్తుచేశారు. ఆర్థిక కారణాల వల్ల చంద్రబాబు బీజేపీ నుంచి బయటకు వచ్చార‌ని రాష్ట్ర ప్రయోజనాలు ఆశించైతే కాద‌ని ఆరోపించారు. ప్రాంతీయ పార్టీలు హోదా సాధించ లేవు. జాతీయ పార్టీల వల్లే హోదా సాద్యం అన్నారు.

Just In...