Published On: Thu, Jun 14th, 2018

జాతీయ ఫార్మ‌శీ ప్ర‌వేశ ప‌రీక్ష‌లో సిద్ధార్థ ఫార్మ‌శీ విద్యార్థుల ప్ర‌తిభ‌

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ‌: జాతీయ స్థాయిలో ఫార్మ‌శీ ప్ర‌వేశాల కోసం అహ్మ‌దాబాద్ వారు నిర్వ‌హించిన నిప్ప‌ర్-2018 ప్ర‌వేశ ప‌రీక్ష‌లో విజ‌య‌వాడ మొగల్రాజ‌పురంలోని కేవీఎస్ఆర్ సిద్ధార్థ ఫార్మ‌శీ కాలేజ్ విద్యార్థులు చ‌క్క‌ని ప్ర‌తిభ క‌న‌బ‌ర‌చి మంచి ర్యాంకులు సాధించార‌ని క‌ళాశాల ప్రిన్సిప‌ల్ డాక్ట‌ర్ దేవ‌ల‌రావు గ‌రిక‌పాటి గురువారం ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. క‌ళాశాల‌కు చెందిన ఆర్‌.మాధురి, పి.శ్రీలేఖ‌, జె.భ‌వానీలు జాతీయ‌స్థాయిలో వ‌రుస‌గా 258, 408, 454 ర్యాంకులు సాధించార‌ని పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా ర్యాంకులు సాధించిన విద్యార్థుల‌ను సిద్ధార్థ అకాడెమీ అధ్య‌క్ష‌, కార్య‌ద‌ర్శులు న‌ల్లూరి వెంక‌టేశ్వ‌ర్లు, పాల‌డుగు ల‌క్ష్మ‌ణ‌రావు, క‌ళాశాల క‌న్వీన‌ర్ డాక్ట‌ర్ చ‌ద‌ల‌వాడ నాగేశ్వ‌ర‌రావు, అధ్యాప‌కులు, స‌హ విద్యార్థులు అభినందిచిన‌ట్లు దేవ‌ల‌రావు తెలిపారు.

Just In...