Published On: Mon, Apr 6th, 2020

జిల్లాలో 28 క‌రోనా పాజిటీవ్ కేసులు గుర్తింపు..

* కృష్ణా క‌లెక్ట‌ర్ ఎ.యండి.ఇంతియాజ్

విజ‌య‌వాడ‌, సెల్ఐటి న్యూస్‌: కృష్ణా జిల్లాలో ఇప్ప‌టివ‌ర‌కూ 28 కరోనా పాజిటివ్ కేసులుగా గుర్తించడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఎయండి ఇంతియాజ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంతవరకు 348 మంది నమూనాలు సేకరించగా వాటిలో 146 నెగిటివ్ గాను,174 పరిశీలనలో వుండగా28 పోజిటివ్ కేసులుగా గుర్తించడం జరిగిందన్నారు. ఈ కేసుల్లో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 17 కేసులు, పెనమాలూరు మండలంలో 3 కేసులు, జగ్గయ్యపేట లో 3 కేసులు, చంద్రర్లపాడులో 1 కేసు, నందిగామలో 1 కేసు, నూజివీడులో 2 కేసులు, బందరులో 1 కేసు నమోదు నమోదు కావడం జరిగిందన్నారు. ప్రతిరోజు ఆ కేసుల తాలూకా వారు నివసించిన ప్రాంతాల్లో కంటైన్మెంట్ జోన్స్ ఏర్పాటు చేసి ప్రత్యేక టీంల ద్వారా సర్వే చేయుంచి వారి ఆరోగ్య స్థితిగతులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంద‌న్నారు. ఈ 28 కేసుల్లో మొదటి కేసులోని వ్యక్తి ఆసుపత్రిలో ట్రీట్‌మెంట్ పూర్తి చేసుకొని సంపూర్ణ ఆరోగ్యంతో విడుదల కాబడ్డారన్నారు. జిల్లా వ్యాప్తంగా వున్న క్వారoటైన్ కేంద్రాల్లో 460 మంది వ్యక్తులు ఐసోలాషన్‌లో ఉన్నారన్నారు.

 

Just In...