Published On: Sat, May 23rd, 2020

జిల్లా వ్యాప్తంగా 26,996 మందికి వైద్య పరీక్షలు

* కృష్ణా క‌లెక్ట‌ర్ ఏయండి ఇంతియాజ్‌

విజ‌య‌వాడ‌, సెల్ఐటి న్యూస్‌: కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా అనుమానిత లక్షణాలు ఉన్న వారందరికీ పరీక్షలు నిర్వహిస్తున్నామని కలెక్టర్ ఏఎండి ఇంతియాజ్ పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా విజ‌య‌వాడ‌లోని ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియం వద్ద పారిశుద్ధ్య కార్మికులకు కరోనా నిర్ధారణ కోసం చేపడుతున్న వైద్య పరీక్షల విధానాన్ని శనివారం ఆయన స్వ‌యంగా పరిశీలించారు. అనంత‌రం కలెక్టర్ ఇంతియాజ్ మాట్లాడుతూ పదిహేను మంది వైద్యుల బృందాలతో ప్రతి రోజు జిల్లా వ్యాప్తంగా పరీక్షలు నిర్వహిస్తున్నా మన్నారు. ఇంతవరకు జిల్లా వ్యాప్తంగా 26,996 మందికి పరీక్షలు నిర్వహించామన్నారు. వారందరికీ  వైద్య చికిత్స అందించామన్నారు. శనివారం రోజున 1027 మంది కి విజయవాడలో 263, ఇబ్రహీంపట్నం లో  240, చిన ఓగిరాల లో పి హెచ్ సి పరిధిలో 207, విజయవాడ పైడ్ క్వారెంటాయిన్ లో 25 , గన్నవరం లో 164, ఈడ్పుగల్లులో 15, పోరంకి 66, విజయవాడలో ని ఓల్డ్ జి జి హెచ్ లో 37 పరీక్షలు నిర్వహించామని తెలిపారు.  జిల్లాలో  ఈ రోజు వరకు 310 మందిని డిశ్చార్జ్ చేశామన్నారు.

Just In...