Published On: Mon, Apr 22nd, 2019

జీయస్టీపై బిల్డర్లకు అవగాహన సదస్సు

* సొంతింటి కల సాకారానికి సువర్ణావకాశం

* జిఎస్టిపై అవగాహన సదస్సులో చార్టెడ్ అకౌంటెంట్ అండ్ కన్సల్టెంట్ శివప్రసాద్

సెల్ఐటి న్యూస్‌, విజయవాడ: పాత జీఎస్టీ విధానానికి కొత్త జిఎస్టీ విధానానికి చాలా తేడా ఉందని  చార్టెడ్ అకౌంటెంట్ అండ్ కన్సల్టెంట్ ఆఫ్ జిఎస్టి ఎ.శివప్రసాద్ అన్నారు. జీఎస్టీపై ఉన్న అపోహలను తొలగించేందుకు జిఎస్టి అధికారులు, క్రెడాయ్ విజయవాడ చాప్టర్ సంయుక్త ఆధ్వర్యంలో జిఎస్టిపై అవగాహన సదస్సును విజ‌య‌వాడ‌లోని ఓ హోట‌ల్‌లో సోమ‌వారం నిర్వ‌హించారు. కార్య‌క్ర‌మంలో పాల్గొన్న చార్టెడ్ అకౌంటెంట్ అండ్ కన్సల్టెంట్ ఆఫ్ జిఎస్టి శివప్రసాద్ మాట్లాడుతూ పాత జీఎస్టీ విధానానికి కొత్త జిఎస్టి విధానానికి చాలా తేడా ఉందని వివ‌రించారు. కొత్త జిఎస్టి లో ఉపయోగాలను వివరించి బిల్డర్ల సందేహాలకు సమాధానమిచ్చి సమస్యలకు పరిష్కారం చూపించారు. పాత జీఎస్టీ విధానం ఇంకా 20 రోజులు మాత్రమే ఉంటుందని ఈలోగా పాత జియస్టీ విధానంతో లేదా కొత్త జియస్టీ విధానం సూచించుకోవాలని కోరారు. పాత కొత్త జీఎస్టీలలో కూడా సరిచేసుకోవాలి  అని లేనియెడల ఆటోమేటిక్‌గా కొత్త జీఎస్టీ విధానం వర్తిస్తుందని తెలిపారు. పాత జస్ట్ ప్రకారం 5శాతం జిఎస్టి ఉంటుందని, కొత్త విధానం ప్రకారం 11శాతం జిఎస్టి ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కానీ కొత్త జిఎస్టి అన్నిటికన్న సులువైన పద్దతిలోనే చెల్లించాల్సి ఉంటుందన్నారు. 90 మీటర్ల లోపు 45 లక్షల లోపు భవన నిర్మాణం చేసేవారికి కాంపోజిట్ వర్తిస్తుందని  తెలిపారు. జిఎస్టి టాక్స్‌ను కొనుగోలుదారులు ఒక శాతం మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. అనంతరం విజయవాడ క్రెడాయ్ చాప్టర్ అధ్యక్షులు ఆర్ .వి. స్వామి మాట్లాడుతూ  జీఎస్టీ నోట్ల రద్దు వల్ల భవన నిర్మాణం రంగం కుదేలైంద‌న్నారు. నిర్మాణ రంగంపై ఆధారపడి అనేక కుటుంబాలు నివశిస్తున్నాయ‌ని, ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న సమయంలో ఇనుము, సిమెంటు, ఇసుక ధ‌ర‌లు ఆకాశాన్నంటుతున్నాయ‌ని ఫ‌లితంగా ఆర్థిక భారం పెరిగి అనుకున్న సమయంలో నిర్మాణాలు చేయ‌లేక‌పోతున్నార‌ని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సిమెంట్ ధ‌ర‌ను తగ్గించి, ఇసుక రీచ్‌ల‌ను కేటాయించాలని డిమాండ్ చేశారు. సమావేశంంలో 13 జిల్లాల నుంచి క్రెడాయ్ ప్రతినిధులు పాల్గొన్నారని తెలిపారు. త్వరలో అన్ని జిల్లాల్లో  చాప్టర్లకు అవగాహన సదస్సును నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో జిఎస్టి అడిషనల్ డైరెక్టర్ రమేష్‌బాబు, జాయింట్ డైరెక్టర్ శర్మ, శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Just In...