Published On: Wed, May 22nd, 2019

జూన్‌ 13 నుంచి ఏపీఎస్‌ ఆర్టీసీ కార్మికుల సమ్మె

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ‌: ఈ ఏడాది జూన్‌ 13 నుంచి సమ్మె చేయాలని ఏపీఎస్‌ ఆర్టీసీ కార్మిక సంఘాల ఐకాస నిర్ణయించింది. ఈ మేరకు కార్మిక సంఘాల నేతలు బుధవారం ఉదయం విజ‌య‌వాడ‌లో మీడియాతో మాట్లాడుతూ సమ్మె వివరాలను వెల్లడించారు. ఏపీ ఆర్టీసీ జెఏసి కన్వీనర్ దామోదరరావు మాట్లాడుతూ కార్మికుల వేతన సవరణ బకాయిలు చెల్లింపు సహా 27 డిమాండ్లను నెరవేర్చాలని సమ్మెకు దిగుతున్నట్లు ఐకాస నేతలు వివరించారు. ఆర్టీసీలో అద్దె బస్సుల పెంపు, సిబ్బంది కుదింపు చర్యల‌ను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ఎంప్లాయీస్‌ యూనియన్‌ సహా 10 కార్మిక సంఘాలు సమ్మె చేయాలని నిర్ణయించినట్లు ఐకాస నేతలు వెల్లడించారు. మంగ‌ళ‌వారం యాజమాన్యంతో జరిపిన చర్చలు విఫలమవడంతో సమ్మె తేదీ ప్రకటించినట్లు పేర్కొన్నారు. సమ్మె జరిగితే ఆర్టీసీ యాజమాన్యమే బాధ్యత వహించాలని ఐకాస నేతలు స్పష్టం చేశారు. డిమాండ్లు పరిష్కరించే వరకు ఎన్నిరోజులైనా సమ్మె చేస్తామని వారు హెచ్చరించారు.

Just In...