Published On: Fri, May 11th, 2018

జేఈఈ ర్యాంక‌ర్ల‌ను అభినందించిన సీఎం చంద్ర‌బాబు

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ ద్వారా జేఈఈలో ర్యాంకులు సాధించిన బాలబాలికలను ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు. రాష్ట్ర మంత్రులు పి.నారాయణ, సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి, నిమ్మ‌కాయ‌ల చిన‌రాజ‌ప్ప‌, నెల్లూరు జిల్లా కలెక్టర్‌ల నేతృత్వంలో జేఈఈఈ ర్యాంక‌ర్లు ఉండవల్లిలోని ప్రజాదర్బార్ హాలులో శుక్ర‌వారం ఉద‌యం ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఒక్క నెల్లూరు జిల్లా నుంచే 45 మంది పరీక్షలు రాయగా 39 మంది ర్యాంకులు సాధించడం గర్వకారణమని ఈ సంద‌ర్భంగా సీఎం చంద్రబాబు ప్ర‌శంసించారు. ప్రపంచ జిమ్నాస్టిక్స్‌లో కాంస్య పతకం సాధించిన బుద్దా అరుణారెడ్డిని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అభినందించారు. మార్చిలో ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్నలో జరిగిన ప్రపంచస్థాయి జిమ్నాస్టిక్స్‌లో అండర్ 19 కేటగిరీలో రాణించి ఏపీకి గుర్తింపు సాధించడం గర్వకారణమన్నారు. పిల్లలు చక్కగా ఆడుతున్నారని, ప్రతిభతో జాతీయ అంతర్జాతీయ స్థాయికి ఎదగడం ముదావహమని చంద్ర‌బాబు పేర్కొన్నారు. తాడపత్రికి చెందిన అరుణ కూడా తల్లిదండ్రులతో కలసి ఉండవల్లిలోని ప్రజాదర్బార్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు.
 

Just In...