Published On: Mon, Aug 28th, 2017

జ‌గ‌న్మాత దుర్గమ్మకు 108 స్వర్ణ పుష్పాలు బహూకరణ

సెల్ఐటి న్యూస్‌, ఇంద్ర‌కీలాద్రి: ప్ర‌ఖ్యాత పుణ్య‌క్షేత్ర‌మైన ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత క‌న‌క‌దుర్గమ్మకు కర్నూలు జిల్లా బేతంచర్ల నివాసి గుండా వెంకటరమణ దంపతులు 108 స్వర్ణ పుష్పాలను ఆగ‌స్టు 27న (ఆదివారం) బహూకరించారు. అమ్మవారి పూజకు వాటిని వినియోగించాలని ఈ సంద‌ర్భంగా దాత‌లు కోరారు. అనంత‌రం దేవస్థానం అధికారులు దాత కుటుంబ సభ్యులకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం చేయించారు. అనంతరం ఆశీర్వచన మండపంలో వేదపండితుల ఆశీర్వచనం చేయగా దేవస్థానం అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు.

gold_flowers_to_Indrakiladri_1

Just In...